Jagga Reddy A war of Love (image credit:Twitter)
తెలంగాణ

Jagga Reddy A war of Love: లవర్స్ ను ఒకటి చేయనున్న జగ్గారెడ్డి.. ఎందుకిలా? అసలేం జరిగింది?

Jagga Reddy A war of Love: ప్రేమికులకు అండగా నిలవబోతున్నారు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఔను.. ఇద్దరు ప్రేమికులను కలిపేందుకు జగ్గారెడ్డి విశ్వప్రయత్నం చేయనున్నారు. అది కూడా ఎన్నో వ్యూహాలు పన్ని మరీ వారి ప్రేమను గెలిపించనున్నారు ఈయన. ఇంతకు జగ్గారెడ్డి ఏంటి? ప్రేమికులను కలపడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం తప్పక చదవండి.

పొలిటికల్ లీడర్ గా జగ్గారెడ్డికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన మైక్ పట్టుకుంటే అన్ని సంచలనాలే. ఈయన పొలిటికల్ లీడర్ గా స్పెషల్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వెండితెరపై తన ఫాలోయింగ్ పెంచేందుకు ఏకంగా సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాలో నటిస్తున్న జగ్గారెడ్డికి ముందుగానే ఫ్యాన్స్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తుండగా, ఇటీవల సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదలైంది. అలాగే ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్‌ను జగ్గారెడ్డి నంది నగర్‌లో ప్రారంభించి, మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. మూవీ టీజర్ అదుర్స్ అంటూ సోషల్ మీడియా కోడై కూసింది.

ఈ టీజర్ లో జగ్గారెడ్డి డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. అందుకే జగ్గారెడ్డి నటిస్తున్న సినిమాపై అభిమానుల అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు. పొలిటికల్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన జగ్గారెడ్డి, సినిమాపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. అందుకే కాబోలు ఇటీవల జగ్గారెడ్డి తెగ బిజీ అయ్యారని చెప్పవచ్చు. తాజాగా జగ్గారెడ్డి తన సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

జగ్గారెడ్డి – ఏ వార్ ఆఫ్ లవ్ సినిమా కథ ను డైరెక్టర్ రామానుజం ప్రిపేర్ చేస్తున్నారన్నారు. డైరెక్టర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారని, ఈ సినిమా లో ప్రేమ కథ కు, తన జీవితం లో జరిగిన మూడు సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. సినిమా లో తన ప్రేమ కథ ఉండదని, ఆ ప్రేమికులకు అండగా నిలిచే పాత్ర లో తాను ఉంటానన్నారు. నన్ను దర్శకుడు ఎంపిక చేసుకున్నారని, జగ్గారెడ్డి గా జీవితం లో జరిగిన మూడు సంఘటనలు ఇందులో ఉంటాయని తెలిపారు.

స్టూడెంట్ లీడర్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా,మున్సిపల్ చైర్మన్ సమయం లో ముఖ్య ఘట్టాలు ఉంటాయని, ఆరోజులలో స్టూడెంట్ లీడర్ గా కౌన్సిలర్ గా , చైర్మెన్ గా ఉన్న సమయం లో తనకు ఎలాంటి ఆర్థిక బలం లేదు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదన్నారు. ఉన్నది కార్యకర్తల , ప్రజల బలమేనని, తనకు ఎలాంటి ధనబలం లేదు.. కానీ కావాల్సినంత జన బలం ఉందన్నారు.

జీవితం లో ఈ మూడు సందర్బాల్లో పోలీసులు తనపై చేసిన ఒత్తిడులు, నిర్బంధాలు , జిల్లా ఎస్పీ తో గొడవ లు ప్రధానంగా సినిమాలో ఉంటాయని తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్ విషయంలో కూడా తనకు గొడవ జరిగిందని, కలెక్టర్ కు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకో లు చేశానన్నారు. కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు పోరాటం చేసిన, ఈ సంఘటనలు సినిమాలో ఉంటాయని జగ్గారెడ్డి తెలిపారు.

Also Read: Hyderabad Crime: మరో 3 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణ హత్య.. అదే కారణమా?

కౌన్సిలర్, స్టూడెంట్ లీడర్, చైర్మెన్ గా ఉన్న సంఘటనల అప్పటి పాత్రలో వేరే నటుడు ఉంటారని, మూడు పాత్రల తర్వాత తాను సినిమా లో ఎంటర్ అవుతానన్నారు. ఈ మూడు ఘట్టాల్లో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు తనను మర్డర్ చేసే ప్లాన్ చేస్తారని, ఆ మర్డర్ కు బలి కాకుండా తాను ప్రతి వ్యూహం ఎలా చేశానో సినిమాలో చూపించ బోతున్నట్లు తెలిపారు. పోలీసుల నిర్బంధాలు, ఒత్తిళ్ల ను ధీటుగా ఎదుర్కుంటూ నిజ జీవితంలో ఎదిగిన తీరును ఈ మూడు పాత్రల ద్వారా ఈ సినిమాలో చూపించ బోతున్నట్లు జగ్గారెడ్డి తన సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇచ్చారు. మొత్తం మీద జగ్గారెడ్డి సినిమా భారీ అంచనాలతో అభిమానుల ముందుకు రానుందన్న మాట.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు