Ips officers transfer : తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. ఎనిమిది మంది ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేస్తూ సీఎస్ శాంతికుమారి (shanthi kumari) ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా (dcp) చైతన్యకుమార్ గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్ లను నియమించారు. వీరందరినీ ఒక డిపార్టుమెంట్ నుంచి మరో డిపార్టుమెంట్ కు మార్చారు. గత రెండు రోజుల క్రితమే ఎనిమిది ఐఏఎస్ లను బదిలీ చేసిన సీఎస్.. తాజాగా ఐపీఎస్ లను కూడా ఎనిమిది మందినే బదిలీ చేశారు. త్వరలోనే మరింత మందిని ట్రాన్స్ ఫర్ చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.