IAS Shailaja Ramaiyer (imagecredit:twiter)
తెలంగాణ

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

IAS Shailaja Ramaiyer: ఎండోమెంట్ కమిషనర్ గా శైలజారామయ్యార్ కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా, చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆమెకు మరో అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తున్నట్లు తెలిసింది. దేవాదాయశాఖ పై ఆమెకు పూర్తిగా అవగాహన ఉండటంతో శాఖ మంత్రి కొండా సురేఖ(Min Konda Sureka) సైతం ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం రెండుమూడ్రోజుల్లో జీవో జారీ చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

కమిషనర్ పోస్టు ఖాళీ

గత నెల 31న ఎండో మెంట్ కమిషనర్ గా పనిచేసిన వెంకట్రావు పదవీ విరమణ చేశారు. ఆయన కమిషనర్ గా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓగా కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న శైలజారామయ్యార్(Sailajaramaiyar) కే కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. చాలా మంది ఈ పోస్టుకోసం పోటీపడినట్లు సమాచారం. అయితే వారికి శాఖపై పట్టులేకపోవడంతో ప్రభుత్వం వారిని పెండింగ్ లో పెట్టినట్లు తెలిసింది.

అధికారుల మానిటరింగ్

దేవాదాయశాఖపై ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల మానిటరింగ్ లేకపోవడంతో అవినీతి ఆరోపణలు, భూములు కబ్జాకు గురవుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే శైలజారామయ్యార్ కే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

Also Read: A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

Just In

01

Pookalam Controversy: పూలరంగవల్లిలో ఆపరేషన్ సిందూర్‌పై వివాదం.. 27 మందిపై కేసు

Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వాక్యలు

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు