New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ పార్టీలు..!
New Year Party (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

New Year Party: న్యూ ఇయర్‌కు గ్రాండ్​‌గా వెల్​ కమ్ చెప్పేందుకు నగరం సిద్ధమవుతున్నది. స్టార్​ హోటళ్లు మొదలుకుని పబ్బులు, రెస్టారెంట్లు, ఫాంహౌస్‌ల యాజమాన్యాలు ఈవెంట్లు జరపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదే అదనుగా డ్రగ్​ పెడ్లర్లు మాదక ద్రవ్యాలను పెద్ద మొత్తంలో నగరానికి చేరుస్తున్నట్టుగా సమచారం. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్‌కు పెద్ద మొత్తంలో డిమాండ్​ ఉంటుండడంతో భారీ ఎత్తున ఇక్కడికి చేరుస్తున్నారు. అదే సమయంలో పోలీస్ యంత్రాంగం డ్రగ్స్‌కు కళ్లెం వేయడానికి విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నది.

పెద్ద మొత్తంలో సరఫరా

నూతన సంవత్సరం సందర్భంగా ట్రై కమిషనరేట్లలో ప్రతీసారి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతి ఉంటుంది. ప్రతీ చోటా వందల సంఖ్యలో యువతీ, యువకులు చేరి న్యూ ఇయర్​ వేడుకలు జరుపుకుంటుంటారు. మందు, విందుతో ఫుల్​ జోష్‌గా న్యూ ఇయర్​‌కు వెల్ కమ్ చెబుతారు. అయితే, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జరిపే వేడుకల్లో డ్రగ్స్ వినియోగం కూడా భారీగానే జరుగుతుంటుంది. ఈసారి కూడా న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి పెడ్లర్లు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను ఇక్కడికి తరలిస్తున్నారు.

Also Read: KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

డెడ్ డ్రాప్​ పద్దతిలో డ్రగ్స్‌ డెలివరీ

కొన్ని నెలలుగా పోలీసులతోపాటు ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ యాంటీ నార్కొటిక్స్​ బ్యూరో, ఎక్సయిజ్ పోలీసులు మాదక ద్రవ్యాల దందాకు చెక్​ పెట్టే దిశగా విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఆపరేషన్లు జరుపుతూ పలువురిని అరెస్టులు చేస్తున్నారు. పాత కేసుల్లో అరెస్టయిన నిందితుల నుంచి సమాచారాన్ని తీసుకుంటూ డ్రగ్స్​ దందాకు చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలో పెడ్లర్లు పోలీసులకు పట్టుబడకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నైజీరియా దేశానికి చెందిన పెడ్లర్లు నేరుగా ఇక్కడికి రాకుండానే డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియా ప్లాట్​ ఫాం అయిన ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ తదితర వాటిని ఉపయోగించుకుంటున్నారు. వీటి ద్వారా ఆర్డర్​ పెడితే హైదరాబాద్‌లో ఉంటున్న తమ ఏజెంట్ల ద్వారా డెడ్ డ్రాప్​ పద్దతిలో డ్రగ్స్‌ను డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నవారు కూడా డ్రగ్స్ కొంటున్న వారితో ప్రత్యక్షంగా కలవకపోవడం. ముందుగా నిర్ణయించుకున్న చోట డ్రగ్స్ పార్సిళ్లను పెడుతున్న డెలివరీ బాయ్స్ వాట్సాప్ ద్వారా లొకేషన్‌ను అవతలి వారికి పంపిస్తున్నారు. ఇక, ఆర్డర్ ఇచ్చిన వారు ఆ చోటకు వచ్చి పార్సిల్ తీసుకుని వెళ్లిపోతున్నారు.

కొరియర్ పార్సిళ్ల రూపంలోనూ..

కొందరు పెడ్లర్లు కొరియర్ పార్సిళ్ల రూపంలో డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. దీనిని ముందుగానే ఊహించిన పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ దందాకు చెక్​ పెట్టేందుకు అంతే స్థాయిలో చర్యలు తీసుకుంటున్నది. గతంలో డ్రగ్స్​ అమ్ముతూ, వినియోగిస్తూ పట్టుబడిన వారి నుంచి డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లపై నిఘా పెడుతున్నారు. దాంతోపాటు డ్రగ్స్ కొనేవారిలా స్టింగ్ ఆపరేషన్లు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కొరియర్​ సంస్థలపై కూడా నిఘా పెట్టారు. ఇప్పటికే వేర్వేరు కొరియర్ సంస్థల నిర్వాహకులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక, పోలీసుల దాడులు అధికమవడంతో డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారు ఫాంహౌస్‌లు, అపార్ట్‌మెంట్ల బాట పడుతుండడంతో వాటిపై కూడా నిఘా పెట్టారు. డిసెంబర్​ 31వ తేదీన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఆయా చోట్ల ఆకస్మిక తనిఖీలను జరపాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్ డిటెక్షన్​ కిట్లతో టెస్టులు జరపడానికి ఏర్పాట్లు చేశారు.

Also Read: Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!