Heavy Rain In Warangal: రోడ్లపైకి చేరిన వరద నీరు, పలు కాలనీలు జలమయం
పూర్తిగా జలమయమైన వరంగల్ అండర్ బ్రిడ్జి
అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో చిక్కుకున్న 2 ఆర్టీసీ బస్సులు, ఆటో.. నిలిచిన రాకపోకలు
హనుమకొండలో చెరవును తలపించి అంబేద్కర్ భవన్ రోడ్డు
తిరుమల జంక్షన్ నుంచి గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వరకు రాకపోకలకు అంతరాయం
32, 33, 39 డివిజన్‌లలో పెద్ద కాల్వ పొంగి ఇండ్లలోకి చేరిన వరద
ఇబ్బందిపడుతున్న కాలనీవాసులు
వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ నగరంలో ఆదివారం భారీ వర్షం (Heavy Rain In Warangal) కురిసింది. జోరు వానతో వరద నీరు రోడ్లపైకి చేరి, పలు కాలనీలు జలమయం అయ్యాయి. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి పరిసరాలు పూర్తిగా జలమయ్యాయి. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో 2 ఆర్టీసీ బస్సులు, ఒక ఆటో చిక్కుకున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండలో అంబేద్కర్ భవన్ రోడ్డు చెరువును తలపించాయి. తిరుమల జంక్షన్ నుంచి గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వరకు రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రేటర్ వరంగల్‌లోని 32, 33, 39 డివిజన్‌లలో పెద్ద కాల్వ పొంగి ఇండ్లలోకి వరద చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక కాలనీల్లో ప్రజలు బయటకి వచ్చేందుకు నానా అవస్తలు ఎదుర్కొన్నారు.
Read Also- GHMC sanitation: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా, హైదరాబాద్‌లో ఎంత చెత్త సేకరించారంటే?
పోలీసుల చొరవతో సురక్షితంగా బయట పడ్డ ఆర్టీసీ బస్సు
భారీ వర్షంతో గంటల వ్యవధిలోనే వరద వ్యాపించి రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులను బస్సులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుండగా పోలీసులు స్పందించారు. తక్షణమే వారిని సురక్షితంగా బయటకు చేర్చారు. వరదలో ఇరుక్కుపోయిన బస్సు నుంచి ఇంతేజార్ గంజ్ పోలీసులు తాళ్ల సహాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. కాపాడిన పోలీసులకు ఆర్టీసీ ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎందుకు ఈ పరిస్థితి ఎంతకాలం ఈ వెతలు
చిన్నపాటి వర్షానికి వరంగల్లోని అనేక రహదారులు భయంకరంగా మారి కాలనీలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో, నాళాలు విస్తరించి, అక్రమ కట్టడాలు తొలగించి వరద ఉధృతి నియంత్రించేందుకు కాలనీలోకి నీళ్లు రాకుండా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నప్పటికీ, కార్యరూపం దాల్చడం లేదు. ప్రతి వర్షాకాలం ఈ తిప్పలు తప్పడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also- Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్