Heatwave in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాలో సాదారనంకంటే అధికంగా ఎండలు తీవ్రత ఎక్కువైపోయాయి. ఉదయం మొదలు వివిధ ప్రాంతాలలో వేడిగాలులతో ప్రజలు అల్లాడి పోతున్నారు. గడిచిన 24 గంటల్లో అనేక జిల్లాల్లో భానుడు మండి పోతున్నాడు. రాష్ట్రంలో సగటున 45 డిగ్రీల సెల్లియస్ కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. మధ్యరాష్ట్రంలోని కొన్ని వేరువేరు ప్రాంతాలలో 45.1 నుండి 45.3 డిగ్రీల సుల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి.
తెలంగాణ డవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కనీసం 15 వేర్వేరు ప్రదేశాలలో భానుడు మండి పోతున్నాడు. మల్కాపుర్, నిజామాబాద్, మరియు కోడురూ జిల్లాలో భానుడు 45.3 డిగ్రీల సెల్సియస్ వరకు నమొదైంది. మరియు ఖమ్మర్ పల్లి (నిజామాబాద్), తాంసి (నిర్మల్ జిల్లా)లో 45.2 గా నమొదైంది. రాంనగర్ (ఆదిలాబాద్), మొస్రా, పెంబిలో గరిష్టంగా 45.1 డిగ్రీల సెల్సియస్ గా నమొదైంది.
Also Read: 11 Died In Telangana: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 24 గంటల్లో 11 మంది మృతి!
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో గరిష్టంగా 42.5 డిగ్రీల సెల్సియస్, ఎల్బినగర్ లో గరిష్టంగా 42.2 సెల్సియస్ గా నమొదయ్యాయి. హైదరాబాద్ లో కొన్ని వేరు వేరు ప్రదేశాల్లో గరిష్టఉష్టోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుండి 42.5 డిగ్రీల సెల్సియస్ మధ్యలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.