TG Heatwave alert: రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మొన్న కురిసిన ఆకాల వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గగా మళ్లీ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత సైతం మొదలైంది. వచ్చే మూడు రోజులు పాటు ఎండల తీవ్రత మరింత పెరగనున్నాయని సోమవారం వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాదులో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం ఆదిలాబాద్,భద్రాద్రి కొత్తగూడెం , జగిత్యాల్,జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ ఖమ్మం కొమరం భీం, మంచిర్యాల ములుగు, నిర్మల్ నిజామాబాదు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినదని వాతావరణశాఖ తెలిపింది. రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలోను, అటు పిమ్మట ఉత్తర దిశలోను కదిలి రాగల 48 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో నేడు, రేపు తెలంగాణ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.పంట కోత సమయం కాబడి రైతులు సైతం అలర్టుగా ఉండాలని సూచించింది.