Harish Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Harish Rao: మీకు అధికారం ఇచ్చింది ఎందుకు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!

Harish Rao: గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతాం, ప్రత్యేక పాలసీ తెస్తాం, నిధులు పెడతామని చెప్పి రెండేళ్లు అయినా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నుంచి స్పందన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో చిక్కుకుపోయిన 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సందర్భంగా శనివారం మర్యాదపూర్వకంగా హరీశ్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వాల బాధ్యత.. 

జోర్డాన్‌లో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని బీఆర్ఎస్(BRS)‌కు, హరీశ్ రావు(Harish Rao)కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, మన పిల్లలను మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బీఆర్ఎస్(BRS) పార్టీ 12 మందిని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగిందన్నారు.

Also Read: Jupally Krishna Rao: కర్నూల్ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం.. మంత్రి జూపల్లి

ఇద్దరు కేంద్ర మంత్రులు.. 

రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని, కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ(Telangana) బిడ్డలను తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గెలిచిన తరవాత అమలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం మీ భాద్యతగా గుర్తు చేశారు.

Also Read: AI in Tollywood: సినిమాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరుగుతుందా?.. దీనివల్ల జరిగే అనార్థాలు ఏమిటి?

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..