Harish Rao: రైతు ప్రయోజనాలు పక్కన బెట్టి, ఎరువుల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండి పడ్డారు. యూరియా కొరతతో రాష్ట్ర రైతాంగం అల్లకల్లోలం అవుతుంటే తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి, తమ తప్పు లేదన్నట్లు అధికార పక్షం దాన్ని ప్రతిపక్షాల దుష్పాచారంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాత్రం కేంద్రం ఇవ్వడం లేదంటున్నారన్నారు. వీరద్దరిలో ఎవరు నిజం? ఎవరు అబద్దం? ప్రధాని నరేంద్ర మోదీ(PM Modhi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమా? లేక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా’ అని నిలదీశారు.
Also Read: Warangal Crime: భర్తను హత్య చేసిన భార్య.. సహకరించిన ప్రియుడు.. ఎక్కడంటే!
ఎరువుల కొరత లేకపోయినా..
దేశ వ్యాప్తంగా 143 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే, అందుబాటులో 183 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఇప్పటికే 155 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే విధంగా, డీఏపీ(DAP) 45 లక్షల టన్నుల అవసరానికి 49 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని, ఎన్పీకే 58 లక్షల టన్నుల అవసరానికి 97 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపిందని తెలిపినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు నిజమైతే, రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వమే తప్పిదానికి బాధ్యత వహించాలన్నారు. దేశం మొత్తంలో ఎరువుల కొరత లేకపోయినా, తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతుండటం రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని చూపుతుందని విమర్శించారు. రైతులను మోసం చేయడం మానేసి, తక్షణమే అవసరమైన ఎరువులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బహిరంగంగా క్షమాపణలు
దేశానికి అన్నం పెట్టే రైతుల చేతులతో కాళ్లు మొక్కించుకుంటున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతుందన్నారు. రైతులకు సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద నిందలు మాని, రైతుల యూరియా కష్టాలపై ఇప్పటికైనా దృష్టి సారించాలని, యూరియా, ఎరువుల కొరత పై సమీక్ష నిర్వహించి, రైతాంగానికి అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాల డిమాండ్ చేశారు.
Also Read: Telangana Grameena Bank: వికారాబాద్ జిల్లాలో నయా మోసం.. బ్యాంక్‌లో దాచిన డబ్బు మాయం?
