Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు తాము సిద్ధమే అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నారాయణ పేట్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ (brs) పాలన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలంటూ కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. అయితే తాజాగా హరీష్ రావు ఈ సవాల్ ను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలిచినా చర్చకు రావడానికి తాము సిద్ధమే అంటూ తెలిపారు. గత బీఆర్ ఎస్ పాలనలో ఏ విషయంపై మాట్లాడటానికి అయినా తాము రెడీగానే ఉంటామన్నారు.
కాంగ్రెస్ పాలన కంటే తమ పాలన మెరుగ్గా ఉందని నిరూపిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. మళ్లీ పోటీ కూడా చేయనన్నారు. ఆగస్టు 15 లోపు పూర్తి హామీలను అమలు చేసి కాంగ్రెస్ పాలన గొప్పదని నిరూపించుకోవాలని చెప్పుకొచ్చారు.