Telangana Students : తెలంగాణలోని ఉర్ధూ మీడియం స్టూడెంట్లకు (Students) రేపటి నుంచే ఒంటిపూట బడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్ధూ మీడియంలో చదువుకునే విద్యార్థులకు రంజాన్ (Ramadan)) పండుగ సందర్భంగా మార్చి 2 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి.. ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.