Greater Warangal Commissioner: రాంపూర్ డంపు యార్డును క్షేత్ర స్థాయిలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తయితే చెల్లింపులు చేస్తామన్నారు. చెత్త తరలింపు వాహనాల సమాచారం నమోదు జరగాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం బల్దియా పరిధి రాంపూర్ లో గల డంప్ యార్డ్ ను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్వహిస్తున్న తీరును పరిశీలించి సమర్థవంతం గా చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ డంపు యార్డులో లెగసి వ్యర్థాల కోసం చేసిన పనుల నిర్దారణ, బిల్లుల చెల్లింపులు వాస్తవ స్థితి గతులను తెలుసుకోవడం కోసం కమిషనర్ క్షేత్ర స్థాయి లో పర్యటించారు. అగ్రిమెంట్ ప్రకారం పనులు జరిగాయా? అని స్మార్ట్ సిటీ ప్రతినిధులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులకు తగు సూచనలు చేసిన కమిషనర్ మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
డంప్ యార్డ్ కు చెత్తను తరలించే వాహనాలకు చెత్త తో కూడిన వాహనాల బరువు (నెట్ వెయిట్) చెత్త వేసిన తర్వాత వచ్చే బరువు (లాస్ వెయిట్) వచ్చే విధంగా ఏర్పాటు ఉండాలని, ఏ వాహనము ఎన్ని ట్రిప్పులు వేస్తుందో నమోదు చేసుకోవాలని సానిటరీ ఇన్స్పెక్టర్లు జవాన్లను ఆదేశించారు. చెత్త తరలింపు కోసం నిర్వహిస్తున్న పలు వాహనాల లాగ్ బుక్ లను పరిశీలించిన కమిషనర్ సరిగా వివరాలు నమోదు చేయని డ్రైవర్ ల పై చర్యలు తీసుకోవాలని ప్రత్యమ్యాయం గా మనకు డంప్ యార్డ్ లేనందున మనం క్లీన్ చేసిన 17 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు ఫ్రెష్ డంప్ కు వినియోగించుకోవాలని మిగతా స్థలాన్ని ప్రాసెసింగ్ కోసం ఉపయోగించాలని స్మార్ట్ సిటీ ప్రతినిధులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ మహేందర్ డి ఈ రవి కిరణ్ ఏ ఈ లు రామన్న సంతోష్ కుమార్ సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు.