Asifabad Tigers: పులుల ఆవాసానికి కేరాఫ్‌గా ఆసిఫాబాద్ జిల్లా.
Asifabad Tigers (imagecredit:twitter)
Telangana News

Asifabad Tigers: పులుల ఆవాసానికి కేరాఫ్‌గా ఆసిఫాబాద్ జిల్లా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Asifabad Tigers: తెలంగాణ పులుల ఆవాసంగా కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా మారింది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఆవాసంగా ఎంచుకున్నాయి. కవ్వాల్-ఆసిఫాబాద్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నాయి. మహారాష్ట్రలోని తడోబా నుంచి పులులు ఎక్కువగా తెలంగాణకు వలస వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి, తిప్పేశ్వర్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలు ఉన్నాయి. తడోబా రిజర్వ్​ ఫారెస్ట్​ నుంచి తెలంగాణ సరిహద్దులో ఉండటంతో అక్కడి నుంచి పులులు తెలంగాణకు వలస వస్తున్నాయి. ఆ ఫారెస్టులో దాదాపు 120 నుంచి 150 పులులు ఉన్నాయి. అటవీ ప్రాంతం తక్కువగా ఉండటంతో వాటి మధ్య సంఘర్షణతో టెరిటరీ కోసం సరిహద్దు దాటి తెలంగాణలోకి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

టైగర్ రిజర్వు ఏర్పాటు ప్రభుత్వంచ చర్యలు

తెలంగాణలోకి పులులు వలస వస్తుండటంతో వాటి పరిరక్షణ కోసం కొమురం భీం టైగర్ రిజర్వును ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అక్కడి అభయారణ్యాల్లో తీసుకుంటున్న సంరక్షణ చర్యలతో పులుల సంఖ్య పెరిగిందని భావించిన అధికారులు వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆవాసం(టెరిటరీ) కోసం పులులు సరిహద్దు తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్‌లలోని అడవులకు వలస వస్తున్నాయి. వీటికి వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉండటంతో వాటి రక్షణ చర్యలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల ఓ పులిని వేటగాళ్లు విద్యుత్ కంచె సాయంతో చంపి, దాని గోళ్లు, చర్మాన్ని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. గతంలోనూ పులులను హతమార్చిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి.

Also Read: Adi Srinivas: బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా మీరు పొత్తు పెట్టుకునేది.. ఆది శ్రీనివాస్!

కొమురం భీం పులుల అభయారణ్యం

తరచూ పులులపై పంజా విసురుతుండటంతో ప్రభుత్వం పులుల పరిరక్షణ కోసం కుమురం భీం టైగర్ రిజర్వును తాజాగా ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇప్పటికే పులుల కోసం కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు ఉండగా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని 1,49,288.88 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కొమురం భీం పులుల అభయారణ్యంగా అటవీశాఖ ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చి వెళ్తున్న నేపథ్యంలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు ఈ కొత్త టైగర్ రిజర్వును ఏర్పాటు చేశారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ 2000 కిలోమీటర్లు ఉంటుంది.

పులుల రాకపోకలకు వీలుగా కారిడార్‌

తెలంగాణలో కొత్తగా కొమురం భీం టైగర్ రిజర్వు ఏర్పాటుతో మహారాష్ట్ర నుంచి తెలంగాణ దాకా పులుల రాకపోకలకు వీలుగా పులుల కారిడార్‌ను ఏర్పాటు చేసినట్లయింది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి,తిప్పేశ్వర్ పులుల అభయారణ్యాల నుంచి తెలంగాణ సరిహద్దుల్లోని కుమరంభీం, కవ్వాల పులుల అభయారణ్యాలకు పులులు రాకపోకలు సాగించేలా పులుల కారిడార్ ఏర్పాటు చేశారు. కాగా, మహారాష్ట్ర వలస పులుల సంరక్షణ కోసం కొమురం భీం టైగర్ రిజర్వు ఏర్పాటు చేయాలని 2024వ సంవత్సరం నవంబర్ నెలలోనే తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపాదనలు పంపించారు.

అటవీశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ

ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో కొమరం భీం టైగర్ రిజర్వు ఏర్పాటు చేస్తూ అటవీశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల మహారాష్ట్ర నుంచి వలస పులుల రాకపోకలకు మార్గం సుగమమైంది. కొమురం భీం పులుల అభయారణ్యంలో పులుల సంరక్షణకు ఆసిఫాబాద్ డీఎస్‌వో మెంబర్ సెక్రెటరీగా 11 మంది సభ్యులతో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు మేనేజ్‌మెంట్ కమిటీని రాష్ట్ర అటవీశాఖ ఏర్పాటు చేసింది. దీనివల్ల తెలంగాణలో పులుల పరిరక్షణ వల్ల వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ఫారెస్టులో పులులతో పాటు ఇతర జంతువుల ఆవాసానికి నిలయంగా మారింది.

Also Read: Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ ఏం తేల్చుకుంటారో?

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..