Godavari River Management (imagecredit:twitter)
తెలంగాణ

Godavari River Management: గోదావరి మేనేజ్మెంట్ బోర్డు అత్యుత్సాహం.. ఏపీ ఆఫీసర్లకే ప్రియారిటీ!

Godavari River Management: తమ అధికారులపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వివక్ష చూపిస్తుందని తెలంగాణ ఆరోపించింది. ఎక్స్ టెన్షన్ ఇవ్వకుండా గోదావరి బోర్డు ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. కానీ ఏపీ ఉద్యోగులకు మాత్రం పెద్దపీట వేశారని ప్రశ్నించారు. అర్హత లేకున్నా ప్రమోషన్లను కల్పించడంపై తెలంగాణ ఫైర్ అయింది. ప్రస్తుతం బోర్డులో ఇన్​చార్జి ఎస్​ఈగా పనిచేస్తున్న ఏపీ అధికారి ఆర్. శ్రీకాంత్​రెడ్డికి పూర్తి స్థాయి ఎస్​ఈగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు బోర్డు మంగళవారం పేర్కొంది. బోర్డు రూల్స్​ప్రకారం రెండేండ్ల పాటు ఇన్​చార్జి ఎస్​ఈగా పనిచేస్తేనే పూర్తి స్థాయి ఎస్​ఈగా నియమించేందుకు అవకాశం ఉంటుంది.

కానీ పైన పేర్కొన్న అధికారి అనుభవం ప్రకారం అర్హత లేకున్నా సడలింపులు ఇస్తూ ఎస్ ఈ గా అవకాశం కల్పించినట్లు బోర్డు పేర్కొన్నది. అదేవిధంగా ఏపీ కేడర్​డీఈఈ ఎం.వేణుగోపాల్​అనే మరో అధికారికీ ఈఈగా బోర్డు అవకాశం కల్పించింది. ఇద్దరికీ అర్హత లేకపోయినా సడలింపులు ఇచ్చి మరీ ప్రమోషన్లు కల్పించిన బోర్డు మన అధికారుల విషయానికి వచ్చే సరికి మాత్రం కొర్రీలు పెడుతున్నది. సిబ్బంది కొరత దృష్ట్యా పలువురు అధికారుల డిప్యూటేషన్​ను పెంచాలని ఈఎన్​సీ లేఖ రాసినా బోర్డు కొట్టిపారేస్తూ నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొనడం గమనార్హం.

Also Read: Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్త పార్టీని ఆపేందుకేనా?

ఇక బోర్డు మెంబర్​ సెక్రటరీ అళగేశన్​పై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయించేందుకు కృష్ణా బోర్డు సభ్యులు చైర్మన్​గా ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ కోరినా వినిపించుకోలేదు. తెలంగాణ తరఫున మెంబర్​గా ఉన్న ఈఎన్​సీ జనరల్​అనిల్​కుమార్​ప్రతిపాదనలను బోర్డు కొట్టి పరేసింది. గోదావరి బోర్డులో ఇతర సభ్యులతో కమిటీని వేయలేమని జీఆర్ ఎంబీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్​7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్​కు సంబంధించిన మీటింగ్​మినిట్స్​తుది నివేదికను తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణ అధికారులు పేర్కొన్న ఎజెండా అంశాలను చర్చించేందుకు గోదావరి బోర్డు నిరాకరించినట్లు స్పష్టంమవుతున్నది.

బోర్డులో ఔట్​సోర్సింగ్​ఉద్యోగుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఫాలో అవుతామని మినిట్స్​లో గోదావరి బోర్డు చైర్మన్​వెల్లడించారు. కనీస వేతనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే ఉద్యోగులను నియమిస్తామని ఏకపక్షంగా స్పష్టం చేశారు. ఇక గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఒక్కటేనని, దానిని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ మినిట్స్ లో పేర్కొన్నదని బోర్డు వివరించింది.

అయితే, ఏపీ మాత్రం మన ప్రాజెక్టులపై మెలికలుపెట్టినట్టు మినిట్స్​లో స్పష్టమైంది. ఏపీ ఎగువన తెలంగాణ ప్రాజెక్టులున్నాయని, వాటితో ఏపీపై ప్రభావం పడుతుందని ఏపీ పేర్కొన్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు. అన్ని పవర్​ ప్రాజెక్టులూ ఏపీ భూభాగంలోనే ఉన్నాయని, తెలంగాణలో ఏమీ లేవని, కాబట్టి దీనిపై తెలంగాణకు ఏం సంబంధం లేదని మినిట్స్​లో ఉన్నట్లు బోర్డు చైర్మన్ వివరించారు.

Also Read: Formula E Race Case: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. బీఆర్ఎస్ స్ట్రాంగ్ రియాక్షన్!

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!