Hotel Taj Banjara Seize: హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను ఈ ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయిలు చెల్లించకపోవడం వల్లే అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బకాయిలకు సంబంధించి పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను సీజ్ చేసినట్లు సమాచారం.
నగరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ బంజారా… చాలా ప్రత్యేకమైనది. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇక్కడే బస చేస్తుంటారు. అనేక మంది రాజకీయ నాయకులకు కూడా ఈ హోటల్ బస చేయడానికి ఇష్టపడతారు. అక్కడ పార్టీ సమావేశాలు సైతం జరుగుతుంటాయి.