GHMC Financial Crises: అలా ఇచ్చారు ఇలా లాక్కున్నారు.
GHMC Financial Crises (magecredit:twitter)
Telangana News

GHMC Financial Crises: అలా ఇచ్చారు ఇలా లాక్కున్నారు.. ఖర్చు చేసింది వెయ్యి కోట్లు?

GHMC Financial Crises: రాష్ట్రంలోని అత్యధిక జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. గత గులాబీ సర్కారు హయాంలో అభివృద్ది పనులకు ఏకంగా రూ.6500 కోట్లు అప్పు చేసిన జీహెచ్ఎంసీ నెలకు అసలు మత్తీలు కలిపి రూ.110 కోట్లు చెల్లిస్తుండటంతో ఖజానా ఎప్పటికపుడు ఖాళీ అవుతూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. సకాలంలో ఉద్యోగులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లతో పాటు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సర్కారు మారటం, కొత్త సర్కారు రెండు నెలల క్రితమే జీహెచ్ఎంసీకి బకాయిగా ఉన్న స్టాంప్స్, డ్యూటీ ఛార్జీల కింద రూ. 3 వేల 30 కోట్లను కేటాయించింది.

దీంతో కాస్త ఊపరి పీల్చుకున్న జీహెచ్ఎంసీ మరి కొన్ని నెలల పాటు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్ష న్లు, కాంట్రాక్టర్లకు బిల్లులు తదితర చెల్లింపుల కోసం రూ.వెయ్యి కోట్లను ఖర్చుచేసుకుంది. ఇంకా ఖాతాలో ఉన్న సుమారు రూ.2 వేల 30 కోట్లతో మరి కొన్ని నెలల పాటు జీతాలు, బిల్లులు, మెయింటనెన్స్ ఖర్చుల కోసం ఢోకా లేదని భావించిన సమయంలో ఉన్నట్టుండి జీహెచ్ఎంసీ పర్సనల్ డిపాజిట్ ఖాతా నుంచి రూ.2 వేల 30 కోట్లు ఒక్కసారిగా సర్కారు ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ పీడీ ఖాతా ఖాళీ అయిపోయింది.

Also Read: Heavy Rains TG: తెలంగాణాలో వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

గతంలో ఆర్థిక కష్టాలు

ఈ ఖాతా నుంచి చివరి ట్రాన్సాక్షన్ గా జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగుల ఆరోగ్య బీమా కోసం రూ. 6 కోట్ల 91 లక్షలు సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి బదాలాయించిన తర్వాత ఖాతాలోని నిధులన్నీ సర్కారు ఖాతాలోకి వెళ్లినట్లు సమాచారం. ఫలితంగా జీహెచ్ఎంసీకి గతంలోని ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు రొటీన్ మెయింటనెన్స్, కాంట్రాక్టర్ల బిల్లుల కోసం జీహెచ్ఎంసీ మళ్లీ అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి తలెత్తింది.

కొద్ది నెలల క్రితం సర్కారు జీహెచ్ఎంసీకి విడుదల చేసిన రూ.3 వేల 30 కోట్లలో ఖర్చు చేసిన నిధులు మినహా ఖాతాలో మిగిలి ఉన్న రూ.2 వేల 30 కోట్లు ఒక్కసారిగా ఖజానా నుంచి బదలాయించిన విషయాన్ని ఫైనాన్స్ విభాగం అధికారులు ప్రశ్నించగా, ఆర్థిక సంవత్సరం ముగియటంతో పాటు పీడీ ఖాతా ఖాళీ అయిన విషయం వాస్తవమేనని సమాధానం చెప్పారు. కానీ ఆ నిధులు మళ్లీ జీహెచ్ఎంసీ పర్సనల్ డిపాజిట్ ఖాతాకు తిరిగి వస్తాయని కొందరు అధికారులు చెబుతున్నా, ఆ నిధులు తిరిగొచ్చేందుకు చాలా సమయం పడుతుందని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: GHMC: ఆదేశాలు బేఖాతర్.. బల్దియాలో కార్మిక చట్టాల ఉల్లంఘన..

Just In

01

Bondi Beach Shooting: బాండి బీచ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్.. భారత పాస్‌పోర్టులతో ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన దుండగులు

West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు

MD Ashok Reddy: ఇంటికో ఇంకుడు గుంత తప్పనిసరి సీఎం.. ఆదేశాలతో జలమండలి ఎండీ చర్యలు!

Panchayat Elections: మూడో విడుతపై దృష్టి సారించిన పార్టీలు.. రంగంలోకి ముఖ్య నాయకులు!

Bigg Boss Telugu 9: డిమాన్ పవన్ బిగ్ బాస్ కప్పు కోసమే ఇలా చేస్తున్నాడా?