TPCC Mahesh Kumar Goud: కుల గణన పై కేంద్రం నిర్ణయం తో రాహుల్‌గాంధీ సంకల్పం సిద్ధించిందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కుల గణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని అన్నారు. స్వతంత్ర భారతావనిలో కుల గణన నిర్వహించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో చారిత్రాత్మక కుల గణన ,ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా ఉన్నామన్నారు. శాసన సభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీ కుల గణనకు చట్ట బద్దత కల్పించామని, తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని టీపీసీసీ ఛీఫ్ ఫైర్ అయ్యారు.
పారదర్శక సర్వేపై తప్పుడు ఆరోపణలు చేయడానికి బీసీ బిడ్డగా బండి సంజయ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులమని మరిచి మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. తెలంగాణ కుల గణన తప్పులు తడక అనడం కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. బీసీల పట్ల మీకు చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని 50 శాతం రిజర్వేషన్లు పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Also read: Telangana Govt: మారుమూల పల్లెలకు మహర్దశ.. సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
బీసీ బిల్లు చట్ట బద్దత కోసం ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ముందా అని అన్నారు. కేంద్రం జనగణన తో పాటు కులగణన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వ విజయంమని కేంద్రం దేశ వ్యాప్తంగా కుల గణన ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేతికి కీలక అస్త్రం లభించింది. దేశ వ్యాప్తంగా జన గణనతో పాటు కుల గణన ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో సంతోషం నెలకొన్నది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హస్తం క్లెయిమ్ చేసుకుంటున్నది. దీన్ని జనాల్లోకి బలమైన నినాదంగా తీసుకువెళ్లి మరింత మైలేజ్ పొందేందుకు కాంగ్రెస్ వ్యూహాలు ప్రిపేర్ చేస్తున్నది. తమ ప్రెజర్ తోనే కేంద్రం తలొగ్గిందని ప్రజలకు వివరించనున్నది. రాహుల్ గాంధీ ప్రెజర్ పెట్టడంతోనే కేంద్రం ఒత్తిడికి గురైందని, దీంతో జన గణనతో పాటు కుల గణనను అంగీకరించిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారబోతుందన్నారు. ఇక్కడి కుల గణనలో అనుసరించిన విధానాలు, లెక్కింపు, పారదర్శకత వంటి వాటని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందన్నారు. ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఎజెండాగా పెట్టనున్నారు. కాంగ్రెస్ తోనే ఇది సాధ్యమైందని జనాలకు వివరించాలని పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు ఆదేశాలు ఇవ్వనున్నారు. దీనిపై త్వరలోనే పీసీసీ అధ్యక్షుడు ప్రత్యేక మీటింగ్ ను ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులంతా పాల్గొననున్నారు.
కేంద్రం నిర్ణయం.. నేతల స్పందనలు..
దేశానికి దిక్సూచిగా గతంలో బెంగాల్ ఉంటే.. ఇప్పుడు తెలంగాణ అని మంత్రి కొండా సురేఖ కొనియాడారు. సామాజిక దృక్పథం కలిగిన తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కులగణనకు అంగీకారం తెలిపిందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గి కుల గణనకు కేంద్రం అనుమతించడం స్వాగతిస్తున్నామని ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా కుల గణన నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. కులగణన లెక్కల ఆధారంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు.
Also read: Gold Rate Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇదే మంచి ఛాన్స్!
కాంగ్రెస్ నిర్వహించిన కులగణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు దారిలోకి రావడం శుభ పరిణామని.. ప్రజాభీష్టానికి లొంగి కులగణనను చేపట్టాలని నిర్ణయంచిన కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
1931 లో బ్రిటిష్ కాలంలో జాతీయ స్థాయిలో కుల గణన జరిగిందని, ఇప్పుడు తెలంగాణ చేయడంతో దేశం కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బలహీన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్ లో కులగనన చేయాలన్న ఆలోచనను తాను ఆహ్వానిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ 4 వేల కి.మీ పాదయాత్ర చేసి కుల గణన చేయాలని నిర్ణయించారని, దీని వలన ఆయా కులాలు తమ వాటాను పొందుతాయని గతంలోనే గుర్తుచేశారని వివరించారు. ఆయన ఆదేశాలకనుగుణంగానే తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ పూర్తయిందన్నారు. రాహుల్ ,రేవంత్ దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరించారు. తెలంగాణలో 56.36 శాతం బీసీలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు తీశారని గుర్తుచేశారు.