B. Sudershan Reddy: స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు
B. Sudershan Reddy (imagecredit:swetcha)
Telangana News

B. Sudershan Reddy: భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

B. Sudershan Reddy: భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదని భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి(Justice B. Sudarshan Reddy) అన్నారు. సి.రాఘవాచారి మెమోరియల్ ట్రస్ట్(C. Raghavachari Memorial Trust) ఆధ్వర్యంలో విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు సి.రాఘవాచారి 6వ స్మారకోపన్యాసం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో శనివారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ‘ప్రసార మాధ్యమాలు – న్యాయ వ్యవస్థ’ అనే అంశంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగిస్తూ మూడు దశాబ్దాల పాటు సంపాదకుడిగా రాఘవాచారి పనిచేశారన్నారు.

సర్క్యులేషన్ తగ్గించడానికి..

ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు తీసుకురావాలని ప్రయత్నించినా, పత్రికల స్వేచ్ఛను ప్రజలు, కోర్టులు కాపాడాయన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు, ఇది కేవలం న్యాయసూత్రం కాదు, జీవనసత్యం అని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారమన్నారు. దాన్ని పూర్తిగా నియంత్రిస్తే ప్రజాస్వామ్యం సారం హీనమవుతుందన్నారు. సర్క్యులేషన్ తగ్గించడానికి ఆంక్షలు విధించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సుప్రీం కోర్టు తిరస్కరించిందని తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ మానవ హక్కుల అంతర్భాగమని జాన్ మిల్టన్(John Milton) కూడా చెప్పారని అన్నారు. సోషల్ మీడియా(Social Media) ఇప్పుడు మీడియా చేతుల్లో లేదన్నారు. ప్రపంచంలోని కొద్దిమంది సంపన్నులు సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారన్నారు.

Also Read: The Girlfriend collection: రష్మిక మందాన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..

రాజ్యాంగంలో..

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి(K. Srinivas Reddy) మాట్లాడుతూ రాజ్యాంగంలో మీడియా ప్రస్తావన ఎక్కడ లేదనే విషయం తెల్సిందేనని అన్నారు. రాజ్యాంగంలో మీడియాను బంధించొద్దని అంబేడ్కర్ చెప్పారన్నారు. ప్రజల పక్షాన మీడియా పనిచేయాలని ఆకాంక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రికా రంగ ప్రముఖులు కె.రామచంద్రమూర్తి, ఆర్.వి.రామారావు, దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bandi Sanjay: గోదావరిఖనిలో ఆలయాల కూల్చివేత.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Just In

01

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!