Formula E Race Case: ఫార్మూలా ఈ కార్ రేస్‌కేసులో ఏసీబీ అధికారులు ఐఏఎస్అధికారి అరవింద్‌కుమార్(Aravindh Kumar)కు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. ఇటీవల కేటీఆర్ ను విచారించినపుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫార్మూలా ఈ కార్ రేస్(Formula E Car Race) నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 50 కోట్ల రూపాయలను బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హెచ్ఎండీఏ(HMDA) ద్వారా చెల్లించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ చెల్లింపులు జరిగినపుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో చెల్లింపులు జరపటానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు.
ఐఏఎస్అధికారి అరవింద్ కుమార్
ఇక10కోట్లకు మించి విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపితే రిజర్వ్‌బ్యాంక్(Reserve Bank) నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అయితే, రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా తీసుకోకుండానే విదేశీ మారకద్రవ్య రూపంలో చెల్లింపులు జరిపారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. దీంట్లో సీనియర్ ఐఏఎస్అధికారి అరవింద్ కుమార్ ను 2వ నిందితునిగా, హెచ్ఎండీఏ ఛీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన బీఎల్ఎన్.రెడ్డిని 3వ నిందితునిగా పేర్కొన్నారు. ఈ కేసులో ఇటీవలే ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను సుధీర్ఘంగా విచారించారు. దీంట్లో వెల్లడైన వివరాల ఆధారంగా తాజాగా అరవింద్ కుమార్‌ను ప్రశ్నించనున్నారు.
Also Read: Savita Pradhan: 16 ఏళ్లకే పెళ్లి.. అత్తింటి వేధింపులు.. కట్ చేస్తే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్..!
ఇరుక్కోనున్నారా?
ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ఇరుక్కోనున్నారా? అంటే అదే జరిగేలా ఉందన్న సమాధానం వస్తోంది ఏసీబీ వర్గాల నుంచి. ఇటీవల కేటీఆర్‌ను విచారణ చేసినపుడు మంత్రిగా హైదరాబాద్(Hyderabad) బ్రాండ్ఇమేజ్ పెంచేందుకే ఫార్మూలా ఈ కార్‌రేస్ నిర్వహించినట్టు చెప్పారని సమాచారం. రెండోసారి రేస్ జరగటానికి ముందు స్పాన్సర్స్తప్పుకోవటం వల్ల హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు జరిపించినట్టుగా చెప్పారని తెలిసింది. అయితే, చెల్లింపుల సమయంలో ఏయే నిబంధనలు పాటించాలన్నది అధికారులే చూసుకోవాల్సి ఉంటుందని కూడా కేటీఆర్(KTR) విచారణలో చెప్పినట్టు సమాచారం. సరిగ్గా దీనిపైనే ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్అనుమతి ఎందుకు తీసుకోలేదు? 10కోట్లకు పైగా విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపితే రిజర్వ్ బ్యాంక్అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఎందుకు పట్టించుకోలేదు? అని అడుగనున్నట్టుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో అరవింద్కుమార్తాజాగా జరుగనున్న విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Dengue Treatment: ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ.. ప్రభుత్వ వైద్యం విఫలమా?