Operation Kagar: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను ఆపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. కేంద్రంలోని ప్రభుత్వాలు కార్పోరేట్ల తరపున తప్ప సామాన్యుల తరపున ఆలోచన చేయడం లేదని ఆరోపించారు. తమకు తోచిందే అమలు చేస్తాం .. అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతాం అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది తప్పితే ప్రస్తుత తరం తరపున ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. మన దేశ పౌరులను మనమే కాల్చుకోవడం మంచిది కాదన్నారు.
వ్యవస్థలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని, వాటిని సహించం అనడం మంచి పద్దతి కాదన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను ఏరివేస్తాం అన్న నిర్ణయం సరికాదు, వ్యక్తులనిర్మూలించడం ద్వారా ఆలోచనలను నిర్మూలించలేరని మండిపడ్డారు. ఉన్నత విద్యావంతులు ఎంతో మంది అటు వైపు ఆకర్షించబడుతున్నారు అన్న విషయం ఎందుకు కేంద్రం ఆలోచించడం లేదని నిలదీశారు. తుపాకికి తుపాకి, రక్తానికి రక్తం జవాబు కాదన్నారు. సాగునీళ్ల రాకతో ఉపాధి కల్పన పెరగడం, ప్రజల చేతికి పని రావడంతో ఇక్కడ మావోయిస్టులకు పనిలేకుండా పోయింది.
Also Raed: Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ… కొత్త పార్టీని ఆపేందుకేనా?
ఇక్కడ అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్ కౌంటర్ ఎందుకు జరగలేదు ? ఎందుకు నక్సలిజం విస్తరించలేదు ? అని ప్రశ్నించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా భావించి ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా పరిష్కారం చూపామని, ఇది దేశవ్యాపితంగా ఇది అమలు కావాలని కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వాల తప్పిదాలను సమాజం హర్షించదు .. చరిత్ర క్షమించదన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ వంటి పంటల సాగును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు.
Also Raed: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!