Kcr at passport office
తెలంగాణ

KCR: పాస్ పోర్టు ఆఫీసుకు మాజీ సీఎం కేసీఆర్

(KCR): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి (Passport Office) వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు. తన పాస్ పోర్టును రెన్యూవల్ చేసుకునేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

డిప్లమాటిక్ పాస్ పోర్టును అప్పగించి సాధారణ పాస్ పోర్టును తీసుకునేందుకు అక్కడికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, త్వరలో కేసీఆర్… అమెరికాలో ఉన్న తన మనవడు హిమాన్షు దగ్గరికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం.

కాగా, సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, జోగినపల్లి సంతోష్ కూడా వెళ్లారు. కార్యాలయంలో పని పూర్తయిన అనంతరం ఆయన నందినగర్ లోని నివాసానికి బయలుదేరి వెళ్లారు.

మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో జరిగే బీఆర్ ఎస్ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. బీఆర్ ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి :

Cm Revanth | సైబర్ కేసుల ఛేదనలో హైదరాబాద్ పోలీసుల ముందంజ: సీఎం రేవంత్

 

 

 

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!