KCR Names Child: శతమానం భవతి.. ‘సుమన్’..
జన్మ నక్షత్రం ప్రకారం ‘సుమన్’ అని పేరు ఖరారు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో, ఆయనతోనే తన కొడుకుకి పేరు పెట్టించుకోవాలని ఎదురుచూసిన ఓ అభిమాని కల నెరవేరింది. అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఫలించింది. పరిగి నియోజకవర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామ నివాసి దొడ్ల నర్సింహులు- అనిత దంపతులు చిన్నకొడుకుకి ‘సుమన్’ అని మాజీ సీఎం కేసీఆర్ నామకరణం (KCR Names Child) చేశారు. దీంతో, బాబు పుట్టిన 9 నెలల నుంచి ఎదురుచూస్తున్న వారి ప్రయత్నం మంగళవారం ఫలించింది. నందినగర్ నివాసానికి వెళ్లిన దొడ్ల నర్సింహులు- అనిత దంపతులు కేసీఆర్‌ను కలిశారు. వారిద్దరినీ బీఆర్ఎస్ అధినేత ఆప్యాయంగా ఆహ్వానించారు.
దంపతుల కోరికను మన్నించి, వేద పండితుడి సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన ‘సు’ అక్షరాన్ని ఆధారంగా చేసుకుని ‘సుమన్’ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి, సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు వర్ధిల్లాలంటూ కేసీఆర్ ఈ సందర్భంగా ఆశీర్వదించారు. దంపతులు ఇద్దర తెలంగాణ ఉద్యమకారులు కావడంతో కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని భావించారు. అందుకే, బాబు పుట్టి 9 నెలలు అయినా కేసీఆర్ కోసం ఎదురుచూశారు. కాగా, తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్ స్వయంగా పేరుపెట్టడంతో దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also- Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?
కిక్కిరిసిన నందినగర్..
కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
వచ్చిన ప్రతి ఒక్కరితో ఓపికగా ఫొటోదిగిన మాజీ సీఎం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని కలిసేందుకు మంగళవారం వందలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నందినగర్ నివాసానికి తరలి వెళ్లారు. దీంతో, మంగళవారం నాడు ఆయన నివాసం సందడిగా మారింది. గత రెండు రోజులుగా తనను కలిసేందుకు వస్తున్న అభిమానులందిరికీ ఓపికగా గంటల తరబడి కేసీఆర్ ఫొటోలు దిగే అవకాశం ఇస్తున్నారు. దీంతో, ఒక్కసారైనా కేసీఆర్‌తో ఫోటో దిగాలనే తమ కోరిక నెరవేరడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందంతో మురిసిపోతున్నారు.
Read Also- Battle of Galwan: గల్వాన్ సినిమాపై చైనా అక్కసు.. భారత్ స్ట్రాంగ్ రియాక్షన్.. డ్రాగన్‌కు చురకలు!

