Fire Crime: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలోని ఓ స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్క్రాప్ దుకాణం సమీపంలోనే పెట్రోల్ బంక్‌తో పాటు గృహ సముదాయాలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఎగిసిపడుతున్న మండల కారణంగా ధరూర్ గ్రామం మొత్తం దట్టమైన నల్లటి పొగతో అలుముకుంది.
వృద్ధురాలికి దహన సంస్కారాలు
ఈ ప్రమాదం జరగడానికి సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఓ వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించారు. అటువైపుగా అక్కడినుంచి గాలికి వచ్చిన నిప్పు రవ్వల కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి సహయక చర్యలు చేపట్టారు.
Also Read: Etela Rajender: కేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరంలో నా ప్రమేయం లేదు.. ఈటల
కోటి రూపాయల వరకు నష్టం
స్క్రాప్ దుకాణంలో ప్లాస్టిక్ పాత సామాను గోడౌన్, టైల్స్ షాప్‌తో నిండి ఉండటం వలన ప్రమాదంలో భారీగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసి పడుతున్నాయి. మంటలను అదుపు చేయటం కోసం రెండు ఫైర్ ఇంజనులతో ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఉన్న స్మశానంలో శవం తగలబడుతున్న సమయంలో అగ్ని మితపలు ఎగిరి వచ్చి ప్లాస్టిక్ కు అంటుకుంది. ప్లాస్టిక్ గోడౌన్ నుండి పక్కనే ఉన్న టైల్ షాప్ లోకి తరబడిన అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారుగా కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు భాదితులు పేర్కోన్నారు. మంటలు ఎక్కవగా ఎగిసి పడుతుండటంతో ఆరు ఫైర్ ఇంజన్లలతో మంటలను అదుపు చేయుటకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ఇ క్రమంలో మంటలు ఆర్పే సమయంలో గోడపై నుండి కానిస్టేబుల్ జారీపడి పోయాడు. దీంతో కానిస్టేబుల్‌కి స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: Sridhar Babu: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6 వేల ఉద్యోగాలు.. మంత్రి ప్రకటన