Suryapet News: కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి
Electricity-Incident (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Suryapet News: ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి నీళ్లు కొడుతుండగా చివ్వెంల ఘటన

ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్‌కు విద్యుత్ సరఫరా

చివ్వెంల, స్వేచ్ఛ: ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కొడుకు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గురువారం సూర్యాపేట జిల్లా (Suryapet News) చివ్వెంల మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలోని 7జీ కాలనీలో నివాసం ఉంటున్న మాదాసు బుచ్చయ్య (48) తన ఇంటి నిర్మాణానికి బుధవారం మట్టితోలించారు. ఇంటి పనుల్లో భాగంగా గురువారం సాయంత్రం పిల్లర్లకు నీళ్లు కొట్టేందుకు ట్రాక్టర్ ట్యాంకర్‌లోని మోటార్‌ వేసి, నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్ కొట్టింది. అకస్మాత్తుగా నీటితో పాటు విద్యుత్ సరఫరా అయ్యి బుచ్చయ్య విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు.

Read Also- Shivaji Controversy: శివాజీ వ్యాఖ్యల దుమారంలో మాజీ సర్పంచ్ నవ్య ఎంట్రీ.. సెన్సేషనల్ వ్యాఖ్యలు

కొద్ది నిమిషాల సమయంలోనే అక్కడికి వచ్చిన చిన్న కొడుకు మాదాసు లోకేష్ (22) కూడా కరెంట్ షాక్‌కు బలయ్యాడు. తండ్రికి విద్యుత్ షాక్ కొట్టిన విషయాన్ని గమనించకుండా ట్యాంకర్‌ను తాకడంతో అతడు కూడా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి తండ్రి, కొడుకులను హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also – Pune Elections: బంపరాఫర్.. ఎన్నికల్లో ఓటు వేస్తే.. లగ్జరీ కారు, థాయ్‌లాండ్ ట్రిప్

Just In

01

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల