Anvesh - Sajjanar (Image credit:Twitter)
తెలంగాణ

Anvesh – Sajjanar: సజ్జనార్‌తో నా అన్వేషణ ఇంటర్వ్వూ.. ఏకంగా అలా మాట్లాడుకున్నారేంటి?

Anvesh – Sajjanar: ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. కొంతమంది ఆఫీసర్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ సదరు డిపార్ట్ మెంట్లలో ఫేమస్ అవుతారు. మరికొంత మంది అలా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… తాము చేసిన పనులను నెటిజన్లతో పంచుకుంటూ లేదా సమాజ హితమైన, కొన్నిసార్లు సంచలనమైన పనులు చేస్తూ వార్తల్లో నిలస్తుంటారు. అలాంటి ఆఫీసరే…వీసీ సజ్జనార్. పెద్దగా న్యూస్ ఫాలో కానీ యూత్ కు కూడా సజ్జనార్ అంటే ఎవరో తెలుసు. అదీ ఆయన క్రేజంటే. పోలీసాఫీసర్లలో చాలా మంది సిన్సియర్, డెడికెటెడ్ పోలీసాఫీసర్లు ఉన్నారు. కానీ వాళ్లు బీహైండ్ ది స్క్రిన్ ఉండటానికే ఇష్టపడతారు. కానీ సజ్జనార్ లాంటి వాళ్లు సంచలనాలు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఎన్ కౌంటర్ స్పెషలిస్టు(Encounter)గా పేరుగాంచిన సజ్జనార్(Sajjanar)… సోషల్ మీడియాలో(Social Media)నూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ(Tgsrtc MD)గా ఉన్న ఆయన…ఆర్టీసీ సంబంధించిన అంశాలతో పాటుగా..సైబర్ క్రైమ్స్, సోషల్ అవేర్‌నెస్‌ వంటి అంశాలపై కూడా స్పందిస్తూ నెటిజన్లతో పంచుకుంటుంటారు. కాగా, ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్ ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. చాలా మంది అమాయకులు వాటి బారిన పడి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అయితే కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు(Social media influencers) కూడా బెట్టింగ్ యాప్స్(Betting apps) ప్రమోట్(Betting Apps Promotion) చేస్తుంటారు. వారి ప్రభావం కూడా యువత మీద పడుతోంది. వారి మాటలు నమ్మి చాలా మంది అత్యాశకు పోయి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యలోనే అటువంటి ప్రమాదాలను తగ్గించే క్రమంలో సదరు ఇన్‌ఫ్లూయెన్సర్లతో సజ్జనార్ చర్చిస్తున్నారు. అందులో భాగంగానే… సజ్జనార్ ప్రముఖ యూట్యూబర్(Youtuber) ‘నా అన్వేషణ’(Naa Anveshana) అన్వేష్‌(Anevesh)తో మాట్లాడారు. ప్రపంచ యాత్రికుడిగా పేరొందిన అన్వేష్.. దేశాదేశాలన్ని తిరుగుతూ ఆ  అనుభవాలను ఆ చానెల్ ద్వారా  పంచుకుంటుంటారు. కాగా, తాను అన్వేష్ తో మాట్లాడినట్లు సజ్జనార్… ‘ఎక్స్’ ద్వారా తెలియపరిచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లను ఎలా కట్టడి చేయాలనే అంశంపై అన్వేష్‌తో చర్చించినట్లు ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. వాటి నియంత్రణకు సంబంధించి ఆయనను కూడా భాగం కావాలని కోరినట్లు పేర్కొన్నారు.

SLBC Rescue: టన్నెల్ లోకి రోబోలు… ఎస్ఎల్బీసీ రెస్క్యూకి ఎండ్ కార్డు పడుతుందా?

ఇదిలా వుంటే… ఏపీకి చెందిన ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానీ వ్యవహారంలో అన్వేష్ సజ్జనార్ చర్యలకు మద్దతుగా నిలిచారు. లోకల్ బాయ్ నానీ(Local boy Nani), బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో చేరచేయగా.  దాన్ని వైజాగ్ ఎస్పీ సీరియస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకొని వెంటనే అరెస్టు చేశారు. అయితే ఇటీవల అన్వేష్ ఆ విషయాన్ని ప్రస్తావించారు. లోకల్ బాయ్ నానీ చర్యలని తప్పుబట్టారు.  తాజాగా, అన్వేష్ తో సజ్జనార్ మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయింది.

Cyber Fraud Cafe Trapping: థాయిలాండ్ లో ఘోరం.. కరెంట్ షాకిచ్చి 540 మంది భారతీయులకు నరకం

అన్వేష్ స్టైల్ లో జవాబు… 

అయితే బెట్టింగ్ యాప్ ల విషయంలో చర్చ అనంతరం వీసీ సజ్జనార్ గారు…. అన్వేష్ ను సరాదాగా ఓ ప్రశ్న అడిగారు. దానికి అన్వేష్ తనదైన శైలిలో జవాబిచ్చారు. పెళ్లి ఎప్పుడంటూ సజ్జనార్ అడగగా… దానికి.. ‘‘ ఇంట్లో తినే వాడికి ఒక కూరే. అదే అడుక్కుతినే వాడికి నలభై కూరలు’’ అంటూ సెన్సార్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చూసిన వాళ్లు … అదేంట్రా బాబు.. మాట్లాడుతున్నది పోలీస్ ఆఫీసరుతో. అయినా కూడా బూతులా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?