Etela vs Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఈటల రాజేందర్ పై ఒక్కొక్కరిగా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన టీపీసీసీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసమే తాను రేవంత్ రెడ్డి భజన చేస్తున్నానన్న ఈటల కామెంట్స్ ను తీవ్రంగా తప్పుబట్టారు. తాను 19 ఏళ్ల క్రితమే కౌన్సిలర్ అన్న జగ్గారెడ్డి.. అప్పుడు ఈటల ఎక్కడ ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తాను కౌన్సిలర్ అయినప్పుడు ఈటల చదువుకుంటున్నారని అన్నారు.
రౌడీలకు రౌడీని: జగ్గారెడ్డి
ఈటల పర్శనాలిటీ ఎంత? అని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్ జగ్గారెడ్డి.. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవద్దని విమర్శించారు. తాను రౌడీలకు రౌడీని.. మంచోడికి మంచోడినని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే ఈటల ఎక్కడ ఉండేవారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎవరో చేసిన పుణ్యమా అని లీడర్ అయ్యావని మండిపడ్డారు. మీరు ఒక తిట్టు తిడితే తాను వంద తిడతానని.. కంట్రోల్ లో ఉండి పరువు దక్కించుకోవాలని ఈటెలకు జగ్గారెడ్డి సూచించారు. బీఆర్ఎస్ లో ఈటల నస భరించలేక పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తన సంగతి తెలియాలంటే కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, భగవంత్ రెడ్డిని అడగాలని ఈటలకు సూచించారు. ఆయన బీజేపీలో పిల్లవాడని అన్నారు.
Also Read: Congress on Etela: ఈటల బతుకేంటో మాకు తెలుసు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్!
ఇందిరా గాంధీకి పూజలు
పాక్ తో యుద్ధం నేపథ్యంలో ఇందిరా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చిన జగ్గారెడ్డి.. ఆమెపై ప్రశంసలు కురిపించారు.తన ఇంట్లో దుర్గామాత పక్కన ఇందిరా గాంధీ ఫొటో పెట్టి తన అమ్మ పూజించేదని గుర్తు చేశారు. బీజేపీ దిగ్గజ నేత అటల్ బిహార్ వాజ్ పేయి కూడా అపర కాళీ అని ఇందిరాను ప్రశంసించారని అన్నారు. 1971లో పాక్ తో జరిగిన యుద్ధంలో రాజకీయాలకు అతీతంగా ఇందిరా వ్యవహరించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అమెరికా అప్పట్లో యుద్ధం ఆపాలని చూసిన తమ విషయాల్లో తలదూర్చొద్దని బాహాటంగానే ఇందిరా చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు అమెరికా చెప్పగానే పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి కేంద్రం సిద్ధమైందని గుర్తుచేశారు.