electric Demand
తెలంగాణ

electric Demand : రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

16058 మెగావాట్లకు చేరువ
దక్షిణ డిస్కంలో 10 వేల మెగావాట్లు డిమాండ్
డిమాండ్ ఎంతున్నా సప్లయ్ చేస్తాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

electric Demand : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. బుధవారం గతంలో ఉన్న రికార్డులను అధిగమించి వినియోగం జరిగింది. ఏకంగా 16 వేల మెగావాట్ల మైలురాయిని దాటింది. ఈ నెల 10వ తేదీన 15,998 మెగావాట్లు డిమాండ్ ను అధిగమించగా, బుధవారం ఉదయం 7:55 గంటలకు 16,058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది మార్చి 8న అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 5న విద్యుత్ సంస్థలు అధిగమించాయి. అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ ఏడాదిలో భారీ స్థాయిలో నమోదవుతున్న విద్యుత్ డిమాండును ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్​ సంస్థలు ధీటుగా ఎదుర్కుంటున్నాయని అభినందించారు. డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు.

దక్షిణ డిస్కంలో 10 వేల మెగావాట్ల డిమాండ్..

గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఈ సీజన్ లో 10 వేల మెగావాట్లకు మించి గరిష్ఠ డిమాండ్ రికార్డ్ అవుతున్నది. 10 వేల మెగావాట్ల మార్క్ ను టచ్ చేసింది. ఈనెల 7వ తేదీన 10,130 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్ నమోదు కాగా బుధవారం 10,049 మెగావాట్ల పీక్ డిమాండ్ మరోసారి నమోదైంది. వినియోగం సైతం 200 మిలియన్ యూనిట్లుగా నమోదవుతున్నది. ఈ నెల 18న 202.18 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగింది. గతేడాది సెప్టెంబర్ 20న 9,910 మెగావాట్ల అత్యధిక డిమాండ్, సెప్టెంబర్ 19న 198.80 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి వినియోగం నమోదైంది.

అంతరాయాల్లేకుండా సరఫరా..

ఈ సీజన్ లో మేము ఆశించినట్లుగానే డిమాండ్, వినియోగం నమోదైంది. యాసంగి సీజన్, ఎండాకాలం ప్రభావం వల్ల రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశముంది. ఈ అదనపు డిమాండ్ తట్టుకునేందుకు నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన వంటి పనులు చేశాం.
= ముషారఫ్ ఫరూఖీ, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ

 

Just In

01

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?