Election Commission: జూబ్లీ ఉపఎన్నికకు అబ్జర్వర్లు నియామకం
Jubilee-Hills-ByPoll
Telangana News, లేటెస్ట్ న్యూస్

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం

Election Commission: దేశవ్యాప్తంగా  ఉప ఎన్నికలకు కూడా నియామకం

రంగంలోకి 470 మంది సీనియర్ ఆఫీసర్లు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆదివారం కేంద్ర పరిశీలకులను నియమించింది. దేశవ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాల్లో ఉపఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులను నియమించినట్టు కమిషన్ ప్రకటించింది. ఈ పరిశీలకుల్లో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్‌ఎస్, ఐఆర్‌ఏఎస్, ఐసీఏఎస్ తదితర సేవలకు చెందిన అధికారులను కమిషన్ నియమించింది.

ఈ అధికారులంతా ఎన్నికల ప్రక్రియలో న్యాయం, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తారని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో చట్టం, శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించేందుకు జనరల్‌, పోలీసు పరిశీలకులు వ్యవహరించనుండగా, అభ్యర్థులు ఖర్చు చేసే ఎన్నికల వ్యయాన్ని గమనించేందుకు వ్యయాల పరిశీలకులను నియమించామని కమిషన్ తెలిపింది. కేంద్ర పరిశీలకులు ఎన్నికల సంఘానికి ‘కళ్లు – చెవులు’గా వ్యవహరిస్తారని, సమయానుకూలంగా నివేదికలు పంపిస్తాతుంటారని కమిషన్ వివరించింది. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఓటర్ల అవగాహన, పాల్గొనటానికి కూడా వారు సహకరించనున్నారని తెలిపింది.

జమ్మూ కశ్మీర్‌ (బడ్గామ్‌, నాగ్రోటా), రాజస్థాన్‌ (ఆంటా), ఝార్ఖండ్‌ (ఘాట్షిలా), పంజాబ్‌ (తర్న్ తారన్‌), మిజోరాం (డంపా), ఒడిశా (అపాడా)లో జరగనున్న ఉపఎన్నికల్లో కూడా ఈ పరిశీలకులను నియమించినట్టు కమిషన్ ప్రకటించింది.

Read Also- Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెలుసా?

జిల్లా ఎన్నికల అధికారి కసరత్తు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (JubileeHills bypoll) కోసం నియమించిన నోడల్ అధికారులంతా సిద్దం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ శనివారం ఆదేశించారు. పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తటస్థంగా వ్యవహరిస్తూ నిబంధనలకు లోబడి, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పని చేయాలన్నారు. ఈ మేరకు శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కర్ణన్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోడల్ అధికారుల సన్నద్ధతను ఆయన సమీక్షించారు. ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించకూడదని అధికారులకు సూచించారు. ఎన్నికలకు సంబంధించి నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలో రిటర్నింగ్ అధికారి పాల్గొని నోడల్ అధికారులకు వారి విధులు, బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని కర్ణన్ సూచించారు.

Read Also- Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు