sumanth reddy
తెలంగాణ

Warangal Incident: డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి … ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడిన యువ డాక్టర్

Warangal Incident: వరంగల్ లో ఇటీవల సంచలనం సృష్టించిన వైద్యుడి పై హత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న డాక్టర్ సుమంత్ రెడ్డి చివరకు ప్రాణాలు విడిచాడు. ప్రేమిచి పెళ్లిచేసుకున్న భార్యే  ప్రియుడితో కలిసి అతణ్ని హత్య చేయించింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఈ దారుణానికి ఒడి కట్టింది. ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై తన ప్రియుడు సామ్యూల్‌తో దాడి చేయించింది. తీవ్ర గాయాలపాలైన డాక్టర్ సుమంత్.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ  శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే…

డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరి వివాహం జరిగింది. వీరుండేది వరంగల్ లో. అయితే..
సుమంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా సంగారెడ్డిలో పనిచేశాడు. అతని భార్య ఫ్లోరా టీచర్ గా పనిచేసేది. ఆ సమయంలో

ఓ జిమ్‌కు వెళ్లేది. అక్కడే ఆమెకు సామెల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో ఫ్లోరాను మందలించాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని వరంగల్‌కు మకాం మార్చాడు. అక్కడ కాజిపేటలో క్లినిక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫ్లోరా రంగశాయి పేట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది. అయితే ఇంత జరిగిన ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు. సామ్యూల్ తో సన్నిహితంగానే మెలిగేది. భర్త ఇంట్లో లేని సమయంలో అతన్ని ఇంటికి పిలిపించుకునేది. ఇదే విషయమై భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. దాంతో భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది ఫ్లోరా. సామ్యూల్ కు కొంత డబ్బు ఇచ్చి సుమంత్‌ను చంపేయమని చెప్పింది. అతను గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు రాజు తో కలిసి మర్డర్ ప్లాన్ చేశారు.

ఈ నెల 20వ తేదీ రాత్రి… క్లినిక్ నుంచి తిరిగొస్తున్న సుమంత్ రెడ్డి సామ్యూల్ , రాజు దాడి చేశారు. హెల్మెట్ ధరించిన వారు.. ముందుగా సుత్తి విసిరి సుమంత్ కారు అద్దాన్ని బద్దలు కొట్టారు. ఏంటా అని కారు ఆపి సుమంత్ బయటికి దిగాడు. వెంటనే ఐరన్ రాడ్లతో అతని మీద దాడి చేశారు. చనిపోయాడనుకొని పొరపాటు పడి పారిపోయారు.

కోన ఊపిరితో ఉన్న సుమంత్ ను స్థానికులు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. దాంతో దురాశకు పోయిన ఫ్లోరా, ఆమె ప్రియుడు సామ్యూల్ అతని స్నేహితుడు రాజ్ అరెస్ట్ అయ్యారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు