Bhatti Vikramarka (Image Source: Twitter)
తెలంగాణ

Bhatti Vikramarka: రాహుల్ ను చూస్తే మోదీకి భయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) లపై అక్రమ కేసులు పెట్టి దేశవ్యాప్తంగా కులగణన జరగకుండా అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. రాహుల్ గాంధీని చూస్తే మోదీకి భయం వేస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ చూస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ గురువారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చూసి కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోడీ భయపడుతున్నారని వివరించారు.

Also Read: Naa Anveshana On Aghori: అఘోరీని చీల్చి చెండాడిన నా అన్వేష్.. ఇది మామూలు రోస్టింగ్ కాదు భయ్యా!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేసి 56 శాతం బీసీలు ఉన్నారని, మిగతా వర్గాల సమాచారాన్ని కూడా లెక్కలతో సహా ప్రకటించి, ఎవరి దగ్గర ఆస్తులు, వనరులు ఉన్నాయో స్పస్టంగా తేల్చిందన్నారు. దీన్ని దేశ వ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్నేహితులైన అంబానీ, అదానీల సంపదను తాడిత, పీడిత వర్గాలకు ఇవ్వాల్సి వస్తుందని మోడీ భయపడుతున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు అంతా ఏకం కావాలని కోరారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!