Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతీ పైసా ప్రజలకే ఖర్చు పెడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దోపిడికి గురికానివ్వమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశామని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని డిప్యూటీ సీఎం అన్నారు.
తెలంగాణలో తొలుత కరెంటును ఉత్పత్తి చేసింది.. రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రస్తుతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తోంది కూడా కాంగ్రెస్ సర్కారేనని చెప్పారు. ‘ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తాం. ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతాం. ప్రజల సొమ్ము దోపిడికి గురైతే అత్యంత ప్రమాదకరం’ అని భట్టి అన్నారు.
Also Read: CM Revanth Reddy: ప్రపంచ పెట్టుబడులకు.. హైదరాబాద్ గమ్యస్థానం.. సీఎం రేవంత్ రెడ్డి
మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలంతా ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతోనే వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ‘5 సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం. మధిరలో 60 వేల మంది మహిళా సభ్యులను కలిగి ఉన్న ఇందిరా మహిళ డైరీ దేశానికి తలమానికంగా ఉండబోతోంది’ అని భట్టి పేర్కొన్నారు. రెండు ఏళ్లల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. లక్షలాది ప్రైవేటు ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో రూ.2 కోట్ల వ్యయంతో కాకతీయుల యుగానికి చెందిన శ్రీ సుందర మౌలేశ్వరస్వామి పురాతన దేవాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ప్రాంతీయ చరిత్ర, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ దేవాలయ పునర్నిర్మాణంతో… pic.twitter.com/6MBcXX975t
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) November 13, 2025
