Damodar Rajanarsimha(image credit: swetcha reporter)
తెలంగాణ

Damodar Rajanarsimha: సేవా దృక్పథంతో ప్రజలకు.. వైద్య సేవలు అందించాలి!

Damodar Rajanarsimha: వైద్యాధికారులు బాధ్యతాయుతంగా, సేవా దృక్పథంతో పని చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో రూ.30 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభం చేశారు.

అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల, వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్, వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ … జనాభా ప్రాతిపదికన, ప్రజలకు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

Also Read: 42 Percent rcent BC Reservation: బీసీలకు 42% రిజర్వేషన్ కోసం.. బీసీ చైతన్య వేదిక డిమాండ్!

అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పునఃపరిశీలించి రోడ్డు భద్రత సమావేశాలను నిర్వహించి బ్లాక్ స్పార్ట్ లను గుర్తించాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. ప్రమాదాలు సంభవించిన క్రమంలో సత్వర వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఒక్కో దానికి రూ.5.5 కోట్ల నిధులను కేటాయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

డీఎం హెచ్ఓ, సూపరింటెండెంట్ లు జావాబుదారితనంతో ఉండాలని, ఆసుపత్రుల్లో సంబంధిత అధికారులు అందుబాటులో లేకుంటే ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వేతర ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య పరమైన నిబంధనలకు అనుగుణంగా నడపాలన్నారు.

 Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు తగిన ఏర్పాట్లు లేవు.. అధికారులపై పుట్ట మధు ఫైర్!

నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య కళాశాల, వసతి గృహాలకు సంబంధించి అత్యవసర మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఎంఇ డాక్టర్ నరెంద్ర కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ అజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి లు ఉన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్