Damodara Rajanarsimha: ఉద్యోగాలు సాధించడం ఎలా? అనే అంశంపై నిరుద్యోగులకు తర్పీదు ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఎస్సీ మాదిగ ఉద్యోగ సంఘాలు ఆయనను ప్రత్యేకంగా కలిసి అభినందించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వర్గీకరణతో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందరి పోరాటం వలనే సాధ్యమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ అంశంపై ఫోకస్ పెట్టి పనిచేశారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఉద్యోగ సంఘాలు పనిచేయాలన్నారు.
Jupally Krishna Rao: 8 లక్షల కోట్ల అప్పులు.. గత ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం చేసిన మంత్రి!
ఉద్యోగాలు, ఉపాధి ఎలా సాధించాలనే దానిపై అన్ని గ్రామాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు.ప్రత్యేక మీటింగ్ లు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివరించాలన్నారు. ప్రభుత్వ పథకాలను కూడా ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించాలన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు