Damodar Rajanarsimha: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజ నరసింహ ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావే:శంలో మంత్రి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం వస్తుంది అన్నారు .15 నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పథకాలు అందేలా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రజలకు ఏం చేయాలో అన్ని చేస్తున్నామని మంత్రి తెలిపారు .
Also Read; Jobs in APVVP Eluru: బీటెక్ అర్హతతో ఏపీలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
అయినా వాటిని చెప్పుకోవడం లేదన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని వారిని ఆదుకునే పథకాలను తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కుల గణన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కి దక్కుతుంది అన్నారు.
అత్యంత వెనుకబడిన వారిని ఆదుకోవడం సామాజిక న్యాయం చేయడం ద్వారా వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒకవైపు వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ మరోవైపు నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సబ్సిడీ లోన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో టి జి ఐ ఐ సి నిర్మల జగ్గారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు