Bandi Sanjay:13 లక్షలకుపైగా బ్యాంకు అకౌంట్ల సీజ్
Cyber Crime(image CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Bandi Sanjay:13 లక్షలకుపైగా బ్యాంకు అకౌంట్ల సీజ్.. సీఐఎస్ కార్యకలాపాలపై బండి సమీక్ష

Bandi Sanjay: సైబర్ మోసగాళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.5,489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో సైబర్ కమాండోల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్(సీఐఎస్) కార్యకలాపాలను కేంద్ర మంత్రి సమీక్షించారు.

 Also Read:Jogulamba Temple: వివాదస్పదమవుతున్న జోగులాంబ ఆలయం.. అసలు కారణం అదేనా..!

ఈ సందర్భంగా ఆయన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ప్రాధాన్యతను వివరించారు. సైబర్ నేరాల(పై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోందని తెలిపారు. సైబర్ మోసాల బాధితుల నుంచి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దీంతోపాటు రూ.12 లక్షలకుపైగా సిమ్‌లు/మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు.

అవగాహన కార్యక్రమాలు
రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 13.3 లక్షల మ్యూల్ అకౌంట్లను (Cyber Crime)సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలు) ఫ్రీజ్ చేసినట్లు వివరించారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌లో భాగంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్‌సీఆర్‌పీ), 1930-సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సైబర్ మల్టీ ఏజన్సీ సెంటర్, రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ సౌకర్యం, సస్పెక్ట్ రిజిస్ట్రీ, సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ కమాండోల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే కేంద్ర రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సామర్థ్యాల అభివృద్ధికి సైతం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా, పత్రికలు, ప్రసార్ భారతి, ఆకాశవాణి ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అందులో భాగంగా 1930 పేరుతో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

 Also Read: New GST Rates: కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే.. ధరలు తగ్గే వస్తువులు ఇవే

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క