Ganja Smuggling: గంజాయి స్మగ్లర్లు దారుణంగా రెచ్చిపోతున్నారు. తాజాగా డ్యూటీలో ఉన్న కానిస్టేబల్ ను బైక్ తో ఢీకొట్టి మరీ పారిపోయారు. ఈ ఘటన భద్రాచలంలో (bhadrachalam) చోటు చేసుకుంది. భద్రాచలం బ్రిడ్జి వద్ద ఆదివారం తెల్లవారు జామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్యూటీలో ఉన్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్రచారి అటుగా బైక్ మీద వస్తున్న ఇద్దరిని ఆపాడు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని వారిని చెక్ చేయబోతుండగా బైక్ తో ఢీకొట్టి పారిపోయారు దుండగులు.
ఈ దాడిలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని కాలు విరిగింది. దాంతో యోగేంద్రచారిని పోలీసులు (Police) వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఇక దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు సీసీ పుటేజీలు చెక్ చేస్తున్నారు. ఈ నడుమ భద్రాచలంలో ఇలాంటి స్మగ్లర్ల ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.