Mahabubabad (Image Source: twitter)
తెలంగాణ

Mahabubabad: డీసీసీ అధ్యక్ష పదవికి వెన్నం శ్రీకాంత్ రెడ్డి దరఖాస్తు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కాంగ్రెస్ నేతలు

Mahabubabad: జిల్లాలోని అందరి ఆలోచనలు, అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మురళి నాయక్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ… సోషల్ జస్టిస్ ను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ సమన్వయ నిర్ణయాలను తీసుకుంటుందని వెల్లడించారు. డిసిసి అధ్యక్ష పదవి కోసం ప్రతి సామాజిక వర్గం నుంచి రెండు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. మహబూబాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సంస్థా గత ఎన్నికలు ఉంటాయన్నారు. అప్లికేషన్ తీసుకోవడం మా బాధ్యత ఎంపిక చేయడం ఢిల్లీ పెద్దల బాధ్యతని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రశంసించారు.

ఐదేళ్లు పనిచేసిన వారికి అవకాశం లేదు

జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఐదు ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగిన వారికి మళ్లీ అధ్యక్షుడిని చేసేందుకు అవకాశం లేదని పీసీసీ ఆర్గనైజర్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేసే వారికే నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కోసం జోడేడ్లుగా పనిచేస్తారని గుర్తు చేశారు. పదేళ్లుగా బీజేపీ అరాచకాలు చేస్తూ ఓట్ చొర్ తో గెలిచే దుశ్చర్యకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్ట ప్రణాళికలను చేపట్టిందన్నారు. పారదర్శకంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక ఉంటుందన్నారు. ఆశావహులు దరఖాస్తులు అందజేస్తే నేరుగా ఏఏసిసి కి పంపుతామన్నారు. అక్కడ డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసి రాష్ట్రానికి జాబితా పంపుతారన్నారు.

డోర్నకల్ నాయకులతో ఇంటరాక్షన్

మధ్యాహ్నం మూడు గంటలకు డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, యూత్, మహిళ కమిటీ, నాయకులు, కార్యకర్తలతో ఇంటరాక్షన్ ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్ తెలిపారు. కమ్యూనిటీ పరంగా డీసీసీకి దరఖాస్తులు అందజేయగా స్వీకరించారు. అత్యున్నత నిర్ణయం, పారదర్శకంగా, సామాజికంగా అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన వారికి అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లుగా తెలిపారు. పార్టీని పట్టి పీడిస్తున్న వారిని తరిమికొట్టేందుకే జిల్లా అధ్యక్షులను ఎంపిక న్యాయంగా, ధర్మంగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పటిష్ట ప్రణాళిక రచించింది అన్నారు. కాంగ్రెస్ లో జిల్లాల వారీగా సామాజిక న్యాయం ఉంటుందని చెప్పారు.

Also Read: Toxic Water: హైదరాబాద్‌కు పెనుముప్పు.. విషపూరితంగా జంట జలాశయాలు.. వెలుగులోకి సంచలన నిజాలు!

డీసీసీ అధ్యక్ష పదవికి వెన్నం దరఖాస్తు

మరోవైపు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి దరఖాస్తు దాఖలు చేశారు. ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, పీసీసీ ఆర్గనైజర్, షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఎండీ అవేజ్ లకు అప్లికేషన్ అందజేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కి బెస్ట్ ఆఫ్ లక్, శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Gold Price Today: వామ్మో ఒక్క రోజులోనే.. రికార్డ్ స్థాయిలో పెరిగిన గోల్డ్ రేట్స్?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?