తెలంగాణ: Congress party: ఏప్రిల్ 25 నుంచి 30 వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మీటింగ్ లను జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలుగా విభజించారు. ఈ మేరకు గాంధీభవన్ లో జరిగిన పార్టీ అబ్జర్వర్ల మీటింగ్ లో తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ల అభిప్రాయాలను పరిగణిస్తూనే, కొత్త తరం నాయకులకు ప్రోత్సాహం ఇచ్చేలా పార్టీ తన ప్రణాళికను తయారు చేస్తుంది.
ఇక పార్టీ పదవుల్లోనూ సీనియర్లకే ఎక్కువ అవకాశాలు కల్పించనున్నారు. ఏఐసీసీ ఇన్ చార్జీగా మీనాక్షి నియామకమైన తర్వాత పార్టీలోని లీడర్లను మూడు రకాలుగా విభజించిన విషయం తెలిసింది. మొదట్నుంచి పార్టీలో పనిచేస్తున్నోళ్లు, ఎన్నికల ముందు చేరినోళ్లు, పవర్ లోకి వచ్చాక పార్టీ కండువా కప్పుకున్నోళ్లు ఇలా మూడు కేటగీరీలు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ కేటగిరీకే పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని అబ్జర్వర్ల మీటింగ్ లో తేల్చారు.
ఇక మండల పార్టీ అధ్యక్షుడికి ఐదు పేర్లు, బ్లాక్ లెవెల్ కు మూడు పేర్లును ప్రతిపాదించాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. పార్టీ ప్రోగ్రామ్స్ ను బలంగా తీసుకువెళ్లినప్పుడే జనాల్లోకి మరింత మైలేజ్ వస్తుందని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు మొదలవుతుందన్నారు.
Also Read: Local body elections Mlc: కట్టుదిట్టమైన ఆంక్షలు.. భారీ బందోబస్తు మధ్య పోలింగ్!
జిల్లా సమావేశాలకు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు.
లక్షన్నర పదవులు నింపుతాం: వేం నరేందర్ రెడ్డి
వార్డు మెంబరు నుంచి మేయర్ వరకు దాదాపు లక్షన్నర పదవులు భర్తీ చేసే వెసులుబాటు ఉన్నదని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. వారి కష్టంతోనే కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిందన్నారు. దేశంలో ఒక రోల్ మోడల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
కుల గణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని, లీడర్లు, కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ కింది స్థాయిలో బలంగా ఉంటేనే, పార్టీ అప్పగించిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేరుతాయన్నారు.
Also Read: Lady Aghori: అరెరె పెద్ద సమస్య వచ్చిందే.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దు అఘోరీ!