MLC Candidates: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
Telangana News

MLC Candidates: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే…విజయశాంతికి దక్కిన చాన్స్!

MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల(Mla quota mlc candidates) వివరాలను కాంగ్రెస్ పార్టీ(Congress party) ప్రకటించింది . అసెంబ్లీ(Assembly)లో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానాన్ని సీపీఐ(CPI)కి కేటాయించింది. విజయశాంతి(vijayashanthi), అద్దంకి దయాకర్(Addanki Dayakar), కేతావత్ శంకర్ నాయక్(ketavat Shanker Naik) లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం(AICC) కొద్దిసేపటి క్రితమే  ప్రకటన జారీ చేసింది. ప్రకటించిన స్థానాల మేరకు… ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు స్థానం దక్కింది. అందరూ ఊహించినట్టుగానే అద్దంకి దయాకర్ వచ్చింది. కానీ అనూహ్యంగా విజయశాంతి పేరు తెరమీదకి రావడం. ఆమె పేరు అనౌన్స్ కావడం చకాచకా జరిగిపోయాయి.

కాగా, సినిమా నటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విజయశాంతి అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట్లో టీఆర్ఎస్ లో కొంతకాలం ఉన్న ఆమె… తర్వాత బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు ఖరారు అయింది. ఇక, ఈ నెల 20 వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

Also Read:

IIFA Digital Awards 2025: ఉత్తమ నటిగా ప్రభాస్ హీరోయిన్.. ఉత్తమ నటుడు ఎవరంటే?

 

 

 

 

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!