MP Chamala Kiran Kumar (imagecredit:twitter)
తెలంగాణ

MP Chamala Kiran Kumar: కేసీఆర్ ఫ్యామిలీలో కుర్చీ పంచాయతీ.. కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: MP Chamala Kiran Kumar: కేసీఆర్, హరీష్​ రావుల మధ్య వన్ సైడ్ లవ్ నెలకొన్నదని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎంకు హరీష్​ అంటే లెక్కలేకపోయినా, హరీష్​ మాత్రం కేసీఆర్ పై చాలా ప్రేమ చూపిస్తుంటారని ఆయన గుర్తు చేశారు.

ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో కుర్చీ పంచాయితీ నెలకొన్నదన్నారు. ప్రభుత్వంపై ఎవరు ఎక్కువ విమర్శలు చేస్తే, వాళ్లకు అత్యధిక మార్కులు ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు ఉన్నారని ఎంపీ గుర్తుచేశారు. అందుకే హరీష్​, కేటీఆర్, కవితలు తమ సర్కార్ పై కంటిన్యూగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నా, ఇచ్చిన హామీలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న సర్కార్ కాంగ్రెస్ అని గుర్తు చేశారు.

200 యూనిట్లు కరెంట్, సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు రుణమాఫీ, ఆర్టీసీ ఉచిత బస్సు వంటి స్కీమ్ లను బీఆర్ ఎస్ గుర్తించడం లేదన్నారు. కళ్లుండి కూడా చూడలేని నేతలు విమర్శించడం సరికాదన్నారు. ఇక తమ పీసీసీ అధ్యక్షుడు బీసీ వ్యక్తి ఉన్నారని, బీఆర్ఎస్ లోనూ బీసీకి మంచి పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: Malla Reddy Joins TDP: బీఆర్ఎస్ కు భారీ షాక్.. టీడీపీలోకి మల్లారెడ్డి? బుల్లెట్ ట్రైన్ సాక్షిగా రివీల్!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది