Kavitha letter: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు ఆయన కుమార్తె కవిత (Kalvakuntla Kavitha) లేఖ రాయడంపై కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. కవిత లేఖ ఓ డ్రామా అంటూ కొట్టిపారేశారు. కేసీఆర్ కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీపై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తారా? అంటూ నిలదీశారు. హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ ఈ లేఖను తయారు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
లేఖ వెనక కేటీఆర్, హరీష్!
కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఇద్దరూ కలిసి కవిత పేరుతో లేఖను విడుదల చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలసి పోటీ చేయడం ఖాయమని ఆయన అన్నారు. కవిత లేఖతో బీజేపీ-బీఆర్ఎస్ బంధం (BJP-BRS Alliance)బయటపడిందని చెప్పారు. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయిందని చెప్పారు. అందుకే లేఖ పేరుతో కొత్త డ్రామాకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిందని విమర్శించారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఏం సంబంధం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కక్ష్య పూరితంగానే సీఎం పేరును చార్జిషీట్ లో చేర్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఆరోపణలు నిజమయ్యాయి!
కవిత లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అరోపణలు కవిత లెటర్ అర్థం పడుతుందోని అన్నారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తి అంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు.. కవిత లేఖతో నిజమని తేలాయని అన్నారు. తెలంగాణకి గత పదేళ్లుగా అన్యాయం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రశ్నించలేదని మంత్రి పొన్నం అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కుటుంబ సంస్థలుగా బీజేపి వాడుకుంటోందని చెప్పారు. కాళేశ్వరం నోటీసులు, కవిత లేఖ.. బీఆర్ఎస్ కు సంకటంగా మారాయని అన్నారు. కవిత పేల్చిన బాంబుపై కేటీఆర్ స్పందించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Also Read: TDP Mini Mahanadu: యే క్యా హై.. మహానాడులో ధిక్కార స్వరాలు.. టెన్షన్‌లో తెలుగు తముళ్లు!
కవిత లేఖలో ఏముందంటే?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రశ్నిస్తూ సొంత కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ డాడీ.. అంటూ కవిత ఆరు పేజీల లేఖ రాశారు. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అంటూ కవిత లేఖ రాయడం గమనార్హం. బీసీలకు 42 శాతం కోటా అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం, బీజేపీ గురించి 2 నిమిషాలో ప్రస్తావన ఉండటం వంటి అంశాలను లేఖలో ప్రశ్నించారు. బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని.. రజతోత్సవ సభ ప్రసంగంలో బీజేపీని ఇంకాస్త టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని కేసీఆర్ కు కవిత సూచించారు.