Gaddar
తెలంగాణ

Gaddar | తెలంగాణలో ‘గద్దర్’ ఉద్యమం?

పద్మ అవార్డుల విషయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి లేఖ రాస్తానని ప్రకటించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలు స్పందిస్తూ ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్త పరుస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికి అవార్డులు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అందరికీ అవార్డులు ఇవ్వడం కుదరదు. ఇదంతా పక్కన బెడితే అసలు ప్రజాగాయకుడు గద్దర్‌ (Gaddar) కి అవార్డు ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
వివాదాస్పద పాటలు పాడతూ ఎందరో అమాయక యువకుల్ని అడవులబాట పట్టించారని బండి సంజయ్ గద్దర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అనేకమంది బీజేపీ నేతల చావుకు కారణమైన గద్దర్‌కు పద్మ అవార్డులు ఇచ్చే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ లాంటి భావాజాలం ఉన్న వ్యక్తుల్ని రాష్ట్రం నుంచి తరమివేయడమే తమ లక్ష్యమని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేసి నిజమైన తెలుగు బిడ్డలకు, హిందుత్వవాదులకు న్యాయం చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు. గద్దర్ (Gaddar) గొప్ప నాయకుడు, గాయకుడు, మేధావే కాకుండా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని.. పొడుస్తున్న పొద్దుమీద పోరు తెలంగాణమా, అమ్మ తెలంగాణమా? అంటూ ఆయన పాడిన అనేక పాటలతో తెలంగాణలోని అన్ని వర్గాలను కదిలించారని గుర్తు చేస్తున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ఒక రకంగా గద్దరే ప్రధాన కారణం అని వ్యాఖ్యానిస్తున్నారు. వెంటనే బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
“బీజేపీ నేతల చావుకు కారణమైన గద్దర్‌కు అవార్డు ఇవ్వడం కుదరదు అని చెప్పడం ఏంటి? అసలు బండి సంజయ్‌ కేంద్రమంత్రా? బీజేపీ కార్యకర్తా?” అని ప్రశ్నిస్తున్నారు. అవగాహన లేని వ్యక్తులకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిచాలని.. బండి సంజయ్ వ్యాఖ్యలపై తన స్పందనతో పాటు బీజేపీ విధానం ఏంటో కూడా తెలియజేయాలని అంటున్నారు. గద్దర్ దళితుడు కావడం మూలంగానే కేంద్రం వివక్ష చూడపడంతో పాటు బండి సంజయ్‌ చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి స్పందించి తన వైఖరేంటో చెప్పడంతో పాటు బండి సంజయ్ చేత క్షమాపణ చెప్పించకపోతే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని గద్దర్ అభిమానులు, అంబేద్కరిస్టులు ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పద్మ అవార్డులకు కేంద్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఏడుగురిని సెలక్ట్ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఐదుగురు ఉండగా.. తెలంగాణకు చెందిన వారు ఇద్దరే ఉండడం గమనార్హం. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేలా కేంద్రం అవార్డులు ఇచ్చిందని రాష్ట్ర రాజకీయ నాయకులు, ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ప్రముఖులతో కూడిన జాబితాను పంపిస్తే కేవలం ఇద్దరికే ఇవ్వడం ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరి దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా, పద్మ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు ఎంపికైన విషయం తెలిసిందే. వీరిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, నంద‌మూరి బాల‌కృష్ణ, మంద కృష్ణ మాదిగ‌, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్యలను పద్మ అవార్డులు వరించాయి. తొలుత ఈ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?