Cm Revanth
తెలంగాణ

Cm Revanth : సీఎం రేవంత్ కు రాహుల్ గాంధీ ఫోన్.. ఎస్ఎల్ బీసీ ఘటనపై ఆరా..!

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఫోన్ చేశారు. శ్రీశైలం ఎస్ ఎల్ బీసీ (slbc) ఘటనపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దాదాపు 20 నిముషాల పాటు రేవంత్ తో రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. ఘటన వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి రాహుల్ తెలుసుకున్నారు. కార్మికులను బయటకు తీసుకువచ్చేదాకా ప్రయత్నాలు చేయాలంటూ సూచించారంట. రేవంత్ రెడ్డి ఈ విషయంపై పూర్తి వివరాలను తెలియజేసినట్టు సమాచారం.

ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్​ణారావు ఘటనా స్థలం వద్దకు వెళ్లారని.. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయచర్యలు చేపడుతున్నాయని రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. అవసరం అయితే టన్నెల్ మీద నుంచి తవ్వేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు క్షేమంగా బయటకు రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

25 మందితో కూడిన ఆర్మీ బృందం సహాయక చర్యల్లో పాల్గొంది. కానీ అడుగడుగునా అడ్డంకులే వస్తున్నాయి. ఘటన జరిగిన చోట 6 మీటర్ల వరకు బురద కూరుకుపోయిందని.. దాంతో ఆ చుట్టు పక్కలకు కూడా వెళ్లలేని విధంగా పరిస్థితులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది ప్రభుత్వం.

 

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?