Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరి గుట్టను సందర్శించారు. స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందించారు. స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. 68 కిలోల బంగారంతో ఈ గోపురాన్ని తయారు చేశారు. దీని తయారు కోసం రూ.80 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల గురించి కూడా సీఎం ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.