CM Revanth on Gig Workers: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్..
CM Revanth on Gig Workers (iamgecredit:AI)
Telangana News

CM Revanth on Gig Workers: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. త్వరలో బిల్లు రెడీ రేవంత్ రెడ్డి!

తెలంగాణ: CM Revanth on Gig Workers: తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు –2025 ను త్వరలోనే తీసుకురానున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులందరికీ ఇది వరంగా మారుతుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.

శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మే’ డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందన్నారు.

ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతుందని చెప్పారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు.

Also Read: Anganwadi Holidays: అంగ‌న్వాడీలకు వేసవి సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించడం జరిగిందన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున బోనస్‌ ఇవ్వడంతో పాటు, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు.

గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ కార్మికులు ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. చేనేత కార్మిక కుటుంబాలను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు రుణమాఫీ అమలు చేశామన్నారు.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

RTC Bus Accident: బస్సు రన్నింగ్‌లో ఫెయిల్ అయిన బ్రేకులు.. పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!

Shambala Movie: ‘శంబాల’ థియేటర్‌లో మంచి ఎక్సీపిరియన్స్ చేస్తారు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల..

Hydraa: పాతబస్తీలో హైడ్రా దూకుడు.. ఏకంగా రూ.1700 కోట్ల భూములు సేఫ్!

Sewage Dumping Case: సెప్టిక్​ ట్యాంకర్​ ఘ‌ట‌న‌పై జ‌ల‌మండ‌లి సీరీయస్.. డ్రైవర్, ఓనర్‌పై క్రిమినల్ కేసులు!

Rajagopal Reddy: మంత్రి పదవిపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి