CM Revanth on HCA (Image Source: Twitter)
తెలంగాణ

CM Revanth on HCA: హెచ్ సీఏతో సన్ రైజర్స్ టికెట్ల లొల్లి.. రంగంలోకి రేవంత్.. కీలక ఆదేశాలు

CM Revanth on HCA: హెచ్​ సీఏ వివాదంపై ముఖ్యంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్​ అయ్యారు. ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్​ విచారణకు ఆదేశించారు. పాసుల కోసం సన్​ రైజర్స్​ హైదరాబాద్​ (Sunrisers Hyderabad) జట్టు యాజమాన్యాన్ని వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

క్రికెట్​ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్​ 18వ ఎడిషన్​ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న మ్యాచులన్నీ ఆసక్తికరంగా సాగుతున్నాయి. వీటిని చూడటానికి వేలాది మంది అభిమానులు ఆయా గ్రౌండ్లకు పోటెత్తుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ వర్గాలు ఫ్రీ పాసుల కోసం తమను వేధిస్తున్నాయంటూ సన్​ రైజర్స్​ హైదరాబాద్​ ఫ్రాంచైజీ ఆరోపించినట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. ఫ్రీ పాసుల కోసం బెదిరిస్తే హైదరాబాద్​ ను వదిలి వెళ్లి పోతామని కూడా ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసినట్టుగా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.

తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్​ రెడ్డి స్పందించారు. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ (Hyderabad Cricket Association)పై వచ్చిన ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్​ డీజీ కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డికి (Kothakota Srinivas Reddy) ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని వివరాలను కూడా సేకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్​ రెడ్డి.. సన్​ రైజర్స్​ హైదరాబాద్​ జట్టు యాజమాన్యాని ఫ్రీ పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

Also Read: Pithapuram News: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో ఆటో దందా.. బెంబేలెత్తుతున్న ప్రజలు!

మరోవైపు వివాదంపై హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ వర్గాలు స్పందించాయి. ఫ్రీ పాసుల కోసం సన్​ రైజర్స్​ హైదరాబాద్​ జట్టు యాజమాన్యాన్ని వేధించామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపాయి. హైదరాబాద్​ ను విడిచిపెట్టి వెళ్లి పోతామంటూ సన్​ రైజర్స్​ హైదరాబాద్​ యాజమాన్యం నుంచి ఎలాంటి ఈ మెయిల్​ తమకు అందలేదని స్పష్టం చేశాయి. దీని వెనక కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశాయి. నిజంగా ఇలాంటి ఈ మెయిళ్లు వచ్చి ఉంటే ఆ సమాచారం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ లేదా హైదరాబాద్​ సన్​ రైజర్స్​ యాజమాన్యానికి చెందిన అధికారిక ఈ మెయిళ్ల నుంచి బయటకు వచ్చి ఉండేవన్నాయి. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకుని ఈ విధమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని వ్యాఖ్యానించాయి.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు