CM Revanth Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

CM Revanth Reddy: నక్సలైట్ల చర్చలపై జానారెడ్డి సలహాలు ఉత్తమం.. రేవంత్ రెడ్డి

తెలంగాణ: CM Revanth Reddy: నక్సలైట్ల చర్చలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్​భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నదని వివరించారు.

మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకుంటామన్నారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కమిటీ నేతలు సీఎంను కోరగా, సానుకూలంగా స్పందించారు. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందన్నారు.

Also Read: Leaders are Confused: గులాబీ గుబాళిస్తే.. కమలం పరిస్థితేంటి అయోమయంలో ఆ పార్టీ నేతలు

శాంతిభద్రతల అంశంగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించవద్దన్నారు. మంత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ లు ఉన్నారు.

Just In

01

Kishan Reddy: అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నది ఎవరు?.. ప్రభుత్వం పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Nuclear weapons: పాక్, చైనా అణ్వాయుధాలు పరీక్షిస్తున్నాయన్న ట్రంప్ .. ఇండియా కూడా మొదలుపెడుతుందా?

Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు

Diabetes: ఈ పండు రోజూ తింటే షుగర్‌ రాకుండా కాపాడుతుందా?

CM on SLBC Project: ఎస్ఎల్‍బీసీ పాపం కేసీఆర్‌దే.. హరీశ్ చిల్లరగా మాట్లాడొద్దు.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్