Chilukuru Rangarajan | చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనకి స్వయంగా ఫోన్ చేసిన సీఎం… దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రంగరాజన్ కి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధ్యులను శిక్షిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దాడులు సహించేది లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
