CM Revanth Reddy (image credit:Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: అక్కడైనా.. ఎక్కడైనా.. తెలంగాణ తగ్గేదేలే.. జపాన్ లో ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: జపాన్ లో తెలంగాణ ఖ్యాతిని చూసి అందరూ ముగ్ధులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన పర్యటన ఆసాంతం పెట్టుబడుల ఆకర్షణ మీద ఉంచిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ తెలంగాణ ఖ్యాతిని పెంచేలా తీసుకున్న చర్యలకు యావత్ జపాన్ దాసోహం అంటోంది. కాగా జపాన్ లో ఒసాకో ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు.

ఇక్కడ పలు దేశాలకు చెందిన ఎన్నో వైవిధ్యమైన ప్రత్యేకతలను చాటి చెబుతారు. అందుకే ఈ ఎక్స్ పోలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, పెట్టుబడి అనుకూల వాతావరణంలకు సంబంధించిన పలు ప్రదర్శనలను ప్రదర్శించారు. మన దేశానికి సంబంధించి, ఎక్స్ పోలో పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు మరియు పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పనుంది.

తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.

Also Read: Gold Rate Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు?

విదేశాలలో సైతం తెలంగాణ ఖ్యాతి చాటి చెప్పేలా ఎక్స్ పోలో ప్రదర్శన ఇవ్వడం యావత్ తెలంగాణకు గర్వకారణమని చెప్పవచ్చు. రాష్ట్ర అభివృద్ది లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఇప్పటికే పలు పెట్టుబడులను సాధించగా, ఈ ఎక్స్ పో ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎంతైనా తెలంగాణ మజాకా.. మన రాష్ట్ర సంస్కృతి అంశాలు జపాన్ దేశస్థులకు తెగ నచ్చాయట.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు