CM Revanth Reddy: మరో పదేళ్లు ప్రజాప్రభుత్వమే: సీఎం రేవంత్
CM-Revanth-Reddy (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: కాంగ్రెస్ సర్కార్‌కు నేటితో రెండేళ్లు పూర్తి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తి

అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి
హుస్నాబాద్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మెదక్ బ్యూరో,స్వేచ్ఛ: రైతులు, సామాన్యప్రజలు, యువత, తెలంగాణ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ ప్రజలు ఓటును ఆయుధంగా మార్చుకొని దుర్మార్గమైన పాలనను అంతమొందించి, ప్రజాపాలనను తీసుకొచ్చిన రోజు డిసెంబర్ 3 అని ఆయన ప్రస్తావించారు. నేటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన విజయోత్సవ సభ’లో  ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు, హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో రూ.26,268 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

హుస్నాబాద్‌పై ప్రశంసలు

హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. అరవై ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను ఇవాళ (బుధవారం) కలిసి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also- Formula E car Race case: మెున్న కేటీఆర్.. నేడు అరవింద్ కుమార్.. ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం!

హుస్నాబాద్ కోసం ఎన్ని నిధులైనా ఖర్చు..

డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉందదని, దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇదిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇది. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునే లోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1 లక్షా 4 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. రూ.8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించాం. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్‌కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గత పాలకులు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్‌గా హుస్నాబాద్‌ను ఉపయోగించుకున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు. కానీ, హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయలేదు. గత పాలకుల్లా మేం హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయబోం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also- Crime News: 150కి పైగా దొంగతనాలు చేసిన కరుడ గట్టిన దొంగ అరెస్ట్.. వాడి కన్నుపడితే ఇల్లు గుల్లే..!

సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోండి..

సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లని ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి అభివృద్ధి గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని, ఇవి గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు అని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆరెస్ పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదని, పదేళ్లు ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం